జనసేన వన రక్షణ ముగింపు కార్యక్రమంలో నాదెండ్ల

నేటితో మా జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన వనరక్షణ కార్యక్రమం ద్వారా 124 రోజులలో ఒక లక్షా ఇరవై ఆరు వేల ఎనిమిది వందలు నిమ్మ మొక్కలు పంపిణీ పూర్తిచేసుకుని జనసేనపార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మరియు జనసేనపార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ గారు చేతుల మీదుగా చివరి మొక్క పంపిణీ చేసి విజయవంతంగా ముగించడం జరిగింది ఈ జనసేన వనరక్షణ కార్యక్రమం ఇంతటి విజయవంతం కావడానికి ఎంతగానో సహకరించిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు…

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర మాట్లాడుతూ మా జగ్గంపేట నియోజకవర్గంలో నిరంతరాయంగా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా జనం కోసం జనసేన అనే కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది* ప్రజా సమస్యల పరిష్కారం వైపు కృషి చేస్తూ జనసేన పార్టీ బలోపేతానికి మేము చేస్తున్న ఈ మహా యజ్ఞానికి మీ చల్లని ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము అని తెలిపారు.