తాగునీటి సమస్య తీర్చమంటే జనసేన నేతలపై దాడులు చేస్తారా?.. బాబు పాలూరు

  • పార్వతీపురం నియోజకవర్గం, జనసేన మీడియా సమావేశం

పార్వతీపురం నియోజకవర్గం, బలిజిపేట మండలం, బర్లి గ్రామంలో వైసిపి ఎమ్మెల్యే జోగారావు పర్యటన నేపధ్యంలో మా జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బంకురు పోలినాయుడు, జిల్లా కార్యనిర్వాహణ కార్యదర్శి గంట్యేడ స్వామి నాయుడు బర్లి గ్రామంలో ప్రజలు తాగునీటి కోసం చాలా ఇక్కట్లు పడుతున్నారని, డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షాకాలంలో ఊరంతా చాలా దుర్బలంగా ఉంటుందని ఎమ్మెల్యే గారికి వివరించబోతే, ఎమ్మెల్యే మరియు వారి అనుచరులు బుడితి క్రిష్ణ మరియు పాలవలస మురళి దుర్భాషలాడుతూ ఎమ్మెల్యే సమక్షంలోనే మా జనసేన నేతలిద్దరిపై భౌతిక దాడికి దిగడం ఈ వైసిపి వాళ్లు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడం కాదా అని బాబు పాలూరు ప్రశ్నించారు. మీ జగన్ రెడ్డి “పేదలకు పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధం” అంటూ వింత నాటకాలు ఆడుతూ విపక్షాలపై వ్యంగ్యంగా బ్యానర్లు పెట్టిస్తూ ప్రజలను మోసం చేస్తుంటే, ఈ ఎమ్మెల్యేలు, వైసిపి నాయకులు మాత్రం ప్రజల తరఫున సమస్యలపై నిలదీస్తుంటే సామాన్య కార్యకర్తలు, ప్రజల మీదకి సైతం భౌతిక దాడులకు దిగుతున్నారు. ఎమ్మెల్యే చుట్టూ దొంగ నోట్లు చలామణి చేసేవాళ్లని, రియల్ ఎస్టేట్ దందా నిర్వహించే పెత్తందార్లను పెట్టుకుని మీ వైసిపి ప్రభుత్వం పేదవాళ్లపై యుద్ధం చేస్తున్నారని, ఈ విషయం ప్రజలు గ్రహించారు కాబట్టే మీరు ఎక్కడకి వెళ్లినా తిరుగుబాటు చేస్తున్నారని బాబు పాలూరు దుయ్యబట్టారు. నిన్నటి భౌతిక దాడి అంశాన్ని ఊరికే వదిలిపెట్టమని, దాడి చెయ్యడమే కాకుండా బంకురు పోలినాయుడు కుటుంబ సభ్యులను పిలిచి బెదిరించడం కూడా చేసారని, ఈ విషయంపై స్థానిక ఎస్.ఐ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని తెలియజేసారు. ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, మీ అధిష్ఠానం కుయ్యక్తులను క్షేత్ర స్థాయిలో అమలు చెయ్యాలని చూస్తే జనసేన పార్టీ తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని బాబు పాలూరు, బంకురు పోలినాయుడు, గంట్యేడ స్వామినాయుడు, రగుమండ్ల అప్పలనాయుడు, ఎన్ ఆదినారాయణ, మామిడి సత్యనారాయణ, శ్రీను, సంతోష్, అచ్యుత, రాజు తదితర జనసైనికులు మీడియా ముఖంగా హెచ్చరించారు. బుధవారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, ఈ అరాచక పాలన/చర్యలను నిరసిస్తూ బలిజిపేట మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధీక్ష కూడా చేపట్టబోతున్నామని తెలియజేసారు.