Adilabad: పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తా – సైదల శ్రీనివాస్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో జనసేన పార్టీ బలోపేతం చేసేలా, ప్రజల్లోకి బలంగా పార్టీని తీసుకెళ్లాలని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బొంగునూరి మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్, పొలిటిక్ బ్యూరో సభ్యులు జనాబ్ అర్హమ్ ఖాన్, ఖమ్మం ఇంచార్జి శ్రీ రాం తాళ్లూరి, వరంగల్ ఇంచార్జి శ్రీ ఆకుల సుమన్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జిగా శ్రీ సైదల శ్రీనివాస్ ని నియమించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ నా పై నమ్మకం తో ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జిగా నియమించిన శ్రీ పవన్ కళ్యాణ్, మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్, అర్హమ్ ఖాన్, రాం తాళ్లూరి మరియు ఆకుల సుమన్ లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం గ్రామ స్థాయి నుండి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.