శ్రీకాళహస్తి ఎన్.డి.ఏ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించండి

  • జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శనివారం శ్రీకాళహస్తి పట్టణంలో సీతాలమ్మ గుడి జంక్షన్ నుండి ఫైర్ ఆఫీస్ జంక్షన్, బస్టాండ్ జంక్షన్, విఎంసి జంక్షన్, జయరామారావు వీధి జంక్షన్, బేరివారి మండపం జంక్షన్, బజార్ వీధి, తేరు వీధి, నెహ్రూ వీధి, సినిమా వీధి, బాబు అగ్రహారం, పి. వి. రోడ్డు గర్ల్స్ హై స్కూల్ మీదుగా ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానానికి టీడీపీ సుధీర్ రెడ్డికి సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని, పార్లమెంట్ ఎంపీ స్థానానికి బీజేపీ వరప్రసాద్ కి కమలం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది. ఉమ్మడి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు తోట గణేష్, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.