ఎన్.డి.ఎ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టండి!

నెల్లూరు: పొత్తు గెలవాలి, ప్రభుత్వం మారాలి అంటూ నెల్లూరుకి విచ్చేసిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అడుగడుగునా స్వాగతించిన లక్షలాది అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు పేరుపేరునా జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అభినందనలు ధన్యవాదములు తెలిపారు. సోమవారం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాలతో దూరమైన నాయకులు ఎటెల్లినా మేమంతా మీ వెంటే అంటూ తెల్లటి జెండాపై జనసేన అనే ఆశయాలను స్పష్టంగా తెలిపే జనసేన జండా పట్టి మూడున్నర కిలోమీటర్ మద్దతు తెలిపిన జనసైనికులకు ప్రత్యేక అభినందనలు.
పుట్టిన గడ్డకి ఏదైనా చేయాలని ప్రజలు అడగకుండానే ఎంతో అభివృద్ధిని సాధించి ఈ రోజున మరోసారి సేవ చేయడానికి ముందుకు వచ్చిన పొంగూరు నారాయణ గారిని గెలిపించండి. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తూ జనసేన ప్రజలకి కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా వారి మంచి చెడ్డలు చూసుకునే శ్రీధర్ అన్నని నెల్లూరు రూరల్ లో గెలిపించాలి. ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రజలకు సేవలు చేయాలని సొంత ఖర్చుతో ఉచిత విద్య, వైద్యం, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తూ ఎన్నో సేవలు అందిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలి. విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజల మధ్యలో వచ్చి మాట్లాడగలరా అనుకున్న వేమిరెడ్డి ప్రశాంతి గారు మండుటెండలో సైతం లెక్కచేయకుండా ప్రజా క్షేత్రం లో దూసుకుపోతూ ప్రత్యర్థుల మాటల తూటాలకు సరైన సమాధానం చెబుతూ దూసుకు వెళ్తున్నారు. అభివృద్ధి సాధించాలంటే ఎన్ డి ఏ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రజలు గుర్తు ఎరిగారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఓడిపోతుందని జిల్లా వ్యాప్తంగా ఎన్డీఏ పార్టీల్లోకి వలసలు వెళ్తున్నారు. రెండు సంవత్సరాలు కార్పొరేటర్ గా దేవాలయ ధర్మకర్తగా సేవలు అందించిన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారిని పార్టీలోకి సాధారణంగా కండువా కప్పి ఆహ్వానించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. పాత కొత్త నాయకులతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించుకుని జనసేన పార్టీని బలోపేతం చేస్తాం.