లక్ష ఓట్ల మెజారిటీతో జనసేనాని గెలుపు ఖాయం

  • తిరుపతిలో అధికారులు వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారు
  • ఈసీ ఆదేశాల మేరకు అధికారులు పనిచేస్తున్నారా, వైకాపా కనుసన్నల్లో పనిచేస్తున్నారా
  • ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి, డిజీపి రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయకుంటే అధికారులు స్వతంత్రంగా పనిచేయలేరు
  • తిరుపతిలో డీటీ అశోక్ రెడ్డిని ఎన్నికలకు దూరంగా పెట్టాలి
  • ముద్రగడ పద్మనాభం కుమార్తే జనసేనకు మద్దతు ఇవ్వడం అభినందనీయం
  • ముద్రగడకు కుటుంబ సభ్యుల మద్దతే లేదు
  • తిరుపతిలో టిడిపి, జనసేన నేతలపై బైండోవర్ కేసులు ఏంటి?
  • తిరుపతి నియోజకవర్గ జనసేన అబ్జర్వర్స్ మరియు కిరణ్ రాయల్

తిరుపతి: తమ జనసేనాని పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం ఎన్ని ఆరోపణలు చేసినా పిఠాపురం ప్రజల నమ్మరని.. లక్ష మెజార్టీతో గాజు గ్లాసు గుర్తు ను గెలిపించుకుంటామని, తిరుపతిలో అధికారులు వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని, ఈసీ ఆదేశాల మేరకు అధికారులు పనిచేస్తున్నారా, వైకాపా కనుసన్నల్లో పనిచేస్తున్నారా తిరుపతి జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్క్లబ్లో శుక్రవారం మీడియా ముందు తిరుపతి జనసేన పార్టీ అబ్జర్వర్స్ గా నియమించిన అటికారి కృష్ణ, కూరగాయల లక్ష్మపతి లను మీడియాకు పరిచయం చేస్తూ.. కిరణ్ మాట్లాడారు ముద్రగడ్డ పద్మనాభం సొంత కూతురే ఆయన కు రివర్స్ అయిందన్నారు. ఇప్పుడు చెప్పుతో కొట్టినట్లు మాట్లాడిందని.. మరో సారి ముద్రగడ ఓవరాక్షన్ చేస్తే చెప్పుతో కొట్టేదానికి కూడా ఆమె సిద్ధం ఉందని చురకలు విసిరారు. వైసీపీ అధికారంలో లేకపోయినా అధికారులు వైకాపా భజన చేస్తున్నారని మండిపడ్డారు. తమను పోలీస్ అధికారులు ఆంక్షలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత సిఎస్, డీజీపీలను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రధాన సూత్రధారి చేతివాటం ఉన్న అశోక్ రెడ్డిని కూడా మార్చాలని ఈ సి లకు లెటర్ రాశామని తెలియజేశారు. ఏది ఏమైనా రానున్నది. ఎన్ డి ఏ ఉమ్మడి కూటమి పార్టీల పాలనే నని వారు స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో.. నగర అధ్యక్షుడు రాజారెడ్డి, అకేపాటి సుభాషిని, హేమ కుమార్, మునుస్వామి, సుమన్ తదితరులు పాల్గొన్నారు.