బొమ్మగానిపల్లి గ్రామంలో ఇంటింటా టిడిపి, జనసేన ఉమ్మడి ప్రచారం

బ్రహ్మసముద్రం మండలం(బొమ్మగానిపల్లి): కళ్యాణదుర్గం నియోజకవర్గం, బ్రహ్మసముద్రం మండలం, బొమ్మగానిపల్లి గ్రామంలో టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకి మద్దతుగా వారి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటా టిడిపి, జనసేన ఉమ్మడి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తరఫున మండల అధ్యక్షులు శ్రీరాములు, జనసేన పార్టీ తరఫున మండల అధ్యక్షులు అంజినేయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అమిలినేని సురేంద్రబాబు గారి అల్లుడు ధర్మతేజ గారు & జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ప్రచారంలో ఇంటింటికి మేనిఫెస్టో అంశాలను, మహాశక్తి పథకాలను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం జనసేన వీరమహిళలు షేక్ తార, మమత, కల్పన, క్రమశిక్షణ కమిటీ సభ్యులు గంగరాజు, పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, శెట్టూరు మండల అధ్యక్షులు కాంత్ రాజు, ఉపాధ్యక్షులు చెర్లోపల్లి రామలింగ, కళ్యాణదుర్గం మండల ప్రధాన కార్యదర్శులు కార్తీక్, అనిల్ పాల్యం, చిత్తప్ప, నియోజకవర్గ జనసేన పార్టీ మీడియా ఇంచార్జ్ రాయుడు, జనసైనికులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.