స్కాలర్‌షిప్‌ రద్దుతో పేదలకు చదువు దూరం.. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసరించుకోవాలి: జేవారే రాహుల్

భైంసా పట్టణ కేంద్రం ప్రభుత్వ పాఠశాలలో ఆలిండియా స్టూడెంట్ బ్లాక్ ఏ.ఐ.ఎస్.బి ఆధ్వర్యంలో ఫ్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ ఇవ్వాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర కార్యదర్శి జేవారే రాహుల్ మాట్లాడుతూ ఎస్సీ. ఎస్టీ. మైనార్టీ విద్యార్థులకు ప్రతి ఏటా ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఇస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఫ్రీ మెట్రిక్ విధానాన్ని రద్దు చేస్తూ కేవలం 9, 10వ తరగతుల విద్యార్థులకు చెల్లిస్తామని చెప్పడం సరైన పద్ధతి కాదని, ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. నేడు కేంద్ర ప్రభుత్వం భేటీ పడావో.. బేటి బచావో అంటూనే ఉన్న పాఠశాలలను మూసి వేయడం జరుగుతోంది. టీచర్ పోస్టులు బర్తీ చేయడం లేదు, పాఠశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఈ దేశంలో ఉంది.. అందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఫ్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ ను రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆలిండియా స్టూడెంట్ బ్లాక్ గా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసారు. ఫ్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ పధకంతో ఎస్సీ బీసీ మైనార్టీలు లబ్ధి చెందుతున్నారు. ఈ స్కాలర్‌షిప్‌ రద్దు చేయడం వలన చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రద్దును వెంటనే ఉపసరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.