జనసేన సభ సక్సెస్ తో తాడేపల్లి ప్యాలెస్ కు వెన్నులో వణుకు

  • శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు
  • రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా ప్రజామోదం లభించింది
  • పెడన నియోజకవర్గం మొత్తం సభలోనే ఉంది
  • జనసేన సభతో మంత్రులు, మాజీ మంత్రులకు ముచ్చెమటలు పడుతున్నాయి
  • ఓటమి కళ్ల ముందు కనబడుతోంది
  • ఆవిర్భావ సభకు ఇంతటి విజయం చేకూర్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
  • పెడన నియోజకవర్గం జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్

పెడన: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నారనే విషయం మచిలీపట్నం వేదికగా జరిగిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభను చూస్తే అర్ధంమైపోతుందని పార్టీ పెడన నియోజకవర్గ నాయకులు స్పష్టం చేశారు. విజయవాడ నుంచి వారాహి వాహనాన్ని అధిరోహించి ముందుకు కదిలినప్పటి నుంచి ప్రతి అడుగులో లక్షలాది మంది నీరాజనాలు పలికిన తీరు దేశ రాజకీయ చరిత్రలోనే నభూతో నభవిష్యత్ లా నిలిచిపోతుందన్నారు. వారాహి యాత్ర, ఆవిర్భావ సభల విజయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం పెడన నియోజకవర్గం గూడూరు లో నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్ సుధీర్ మాట్లాడుతూ.. మచిలీపట్నం ఆవిర్భావ సభతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజల ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అంత మంది జనం రారు. మద్యం సీసాకో, బిర్యాని పొట్లానికో ఆశపడి వచ్చినా 12 గంటల పాటు ఓ నాయకుడి ప్రసంగం కోసం ఎదురు చూసిన దాఖలాలు లేవు. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి సభల నుంచి ఆయన ప్రసంగం పూర్తవకుండానే ప్రజలు ఎలా పారిపోతున్నారో చూస్తున్నాం. అలాంటిది మహిళలు, వృద్ధులు సైతం 12 గంటల పాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సందేశం కోసం వేచిచూడడం జనసేన పార్టీ పట్ల ప్రజల్లో పెరిగిన నమ్మకాన్ని తెలియచేస్తోంది. ఇంతటి ప్రజాబలం కలిగిన మా నాయకుడికి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉంది. పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాల నుంచి సభకు తరలివచ్చిన ప్రజల లెక్క చూసి తాడేపల్లి ప్యాలెస్ కి వెన్నులో వణుకు పుడుతోంది. పెడన నియోజకవర్గం మొత్తం జనసేన పార్టీ ఆవిర్భావ సభలోనే ఉంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు లక్ష్యంగా అవాకులు చెవాకులు పేలే మంత్రులు, మాజీ మంత్రులకు గొంతులో పచ్చివెలగకాయ పడింది. ఓటమి కళ్ల ముందు కనపడుతుండడంతో నోరు పెగలడం లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ ముఖ్యమంత్రి కోసం, మీ పదవులు కాపాడుకోవడం కోసం చిల్లర పనులు మాని వైసీపీ ప్రజాప్రతినిధులు కోసం పని చేయాలని జనసేన పార్టీ తరఫున సలహా ఇస్తున్నాం. హితబోధలు వైసీపీ నాయకులకు సహించకున్నా నిజాలు గ్రహించాలి. సభ విజయానికి సహకరించిన కృష్ణా జిల్లా ఎస్పీ గారికి, పోలీస్ శాఖలోని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. సభలో పాల్గొని విజయంలో పాలు పంచుకున్న పెడన నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ రుణపడి ఉంటుంది. మీరిచ్చిన ఉత్సాహంతో జనసేన పార్టీ పెడన నియోజకవర్గ సమస్యలపై మరింత పోరాటం చేస్తుందని మాటిస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా పెడన లాంటి నియోజకవర్గంలో పని చేసే అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పెడన నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేస్తామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో బంటుమిల్లి మండలం ఉపాధ్యక్షులు గోట్రు రవి కిరణ్, జనసేన నాయకులు పోలగాని లక్ష్మీ నారాయణ, దివి శ్రీనివాస్, యర్రపోతు అయ్యప్ప, బాకీ హరీష్, నందం శివ స్వామి, సింగంసెట్టి అనిల్ కుమార్, కటకం మహేష్, సింగంసెట్టి అశోక్ కుమార్, నరహరిసెట్టి ప్రసాద్, వన్నెంరెడ్డి సాయి కిరణ్, యదంరెడ్డి అంజిబాబు, షేక్ మున్నా, షబ్బీర్ దూలిపూడి అఖిల్, సాయి, ప్రకాష్, మధు, మద్దాల పవన్ మరియు పెడన నియోజకవర్గం జనసైనికులు పాల్గొన్నారు.