జనసేన మద్ధతుతో నిడదవోలు బంద్ విజయవంతం

నిడదవోలు నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అరెస్టును ఖండిస్తూ శాంతియుతంగా నిడదవోలులో బంద్ లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతియుతంగా చేస్తున్న కార్యక్రమాల మీద దాడులు, విధ్వంసాలు, బెదిరింపులు, కేసులు నిర్బంధాలతో జగన్ రెడ్డి పాలన కొనసాగుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా 41 నోటీసు ఇచ్చి సిబిఐ వారు అనేక దఫాలుగా పిలిచి విచారించారన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం వద్దుకు వచ్చేసరికి సిఐడి నేరుగా వెళ్లి ఏ వన్ గా పెట్టి ముద్దాయిగా స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి మీరు చేశారని చంద్రబాబు నాయుడును అరెస్ట్ను కుట్రపూరితంగా చేశారన్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని, ప్రజా, ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే విధంగాను, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, చట్టాన్ని అతిక్రమించి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారని ఆరోపించారు. అరెస్టు జరిగిన సందర్భంలో ఏ పార్టీ అయినా పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిందన్నారు. ఈ రోజున వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎవ్వరినీ రోడ్లమీదకు రాకుండా ఇళ్ల దగ్గరే నిర్బంధించడం, ఇళ్ల దగ్గర నుండి బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లడమే కాకుండా బహిరంగంగా పార్టీ నాయకులు నోరెత్తే పరిస్థితి లేకుండా తస్మాత్ జాగ్రత్త మీరు గానీ రోడ్డు ఎక్కితే అరెస్టులు, వేధింపులు తప్పవని బెదిరింపులకు జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతుందన్నారు. ప్రజల స్వేచ్ఛను జగన్ రెడ్డి ప్రభుత్వం హరిస్తుందన్నారు. ఎన్నికలు వస్తున్నాయని, జమిలి ఎన్నికలు జరుగుతాయని ఇతర ప్రతిపక్ష పార్టీలు పోటీ చేసే పరిస్థితులు లేకుండా చేయడానికి జగన్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం వల్లే జగన్ రెడ్డి పాలన కొనసాగుతుందన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం విద్వాంసాలతో మొదలుపెట్టి చివరకు విధ్వంసాలు, అరెస్టులు, దౌర్జన్యాలు, అరాచకాలతో ముగింపు పలికే విధంగా ఉందన్నారు. గతంలో మద్దెలచెరువు సూరి బావ కళ్ళల్లో ఆనందం చూడ్డానికి మర్డర్ చేశానని చెప్పాడని, ఈ రోజున మా బాస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడానికి సిఐడి పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, పోలీసు వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయన్నారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష నేతలను కూడా ఒక రోజైన జైల్లో పెట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఈ కార్యక్రమంలో నిడదవోలు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, జిల్లా సంయుక్త కార్యదర్శి పాలా వీరాస్వామి, పట్టణ నాయకులు రంగా రమేష్, ఉపాధ్యక్షులు పెండ్యాల ఎంపీటీసీ ఇంద్రగౌడ్, మేడా పూర్ణచంద్రరావు, ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు యడ్లపల్లి సత్తిబాబు, యామాన కాశీదుర్గ ప్రసాద్, మండలం కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, నిడదవోలు జనసేన నాయకులు, జనసైనికులు, తెదేపా శ్రేణులు పాల్గొన్నారు.