భారత నౌకాదళంలో నారీమణులు

చరిత్రలో తొలిసారిగా యుద్ధ నౌకల్లో తొలిసారి మహిళా అధికారులను నియమించారు. భారత యద్ధనౌకలలో ఇద్దరు మహిళా నేవీ అధికారిణిలను నియమించారు. యుద్ధ నౌకల్లో మహిళా నేవీ అధికారిణిలను నియమించడం ఇదే తొలిసారి. సబ్ లెఫ్టినెంట్ కుముదిని త్యాగి, సబ్ లెఫ్టినెంట్ రితి సింగ్ ను ఎంపిక చేసింది నావీ. కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడాలో సోమవారం జరిగిన కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ‘వింగ్స్’ ప్రధానం చేశారు. యుద్ధ నౌకలలోని హెలీకాప్టర్ల విభాగంలో వైమానిక వ్యూహకర్తలుగా వీరు వ్యవహరించనున్నారు. ఇప్పటి వరకు నౌకా కేంద్రాల్లోని హెలీకాప్టర్లను మహిళా అధికారిణులు నడిపేవారు. ఇప్పుడు తొలిసారిగా యుద్ధ నౌకపై కూడా హెలీకాప్టర్లను సబ్ లెఫ్టినెంట్ కుముదిని త్యాగి, సబ్ లెఫ్టినెంట్ రితి సింగ్ నడపనున్నారు. కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడాలోని ఇండియన్ నేవీ అబ్జర్వర్ కోర్సులో ఉత్తీర్ణులైన 17 మందిలో వీరిద్దరితోపాటు ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన నలుగురు మహిళా అధికారిణిలు, ముగ్గురు అధికారులు కూడా ఉన్నారు.. మహిళలకు హెలికాప్టర్ ఆపరేషన్లలో తొలిసారి శిక్షణ ఇవ్వడం ఒక మైలురాయి వంటిదని రియర్ అడ్మిరల్ ఆంటోనీ జార్జ్ అన్నారు. భారత నావికాదళంలో ముందుండే యుద్ధనౌకలలో మహిళలను మోహరించడానికి మార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు.