బొబ్బిలి జనసైనికుల నిలయంలో మహిళా దినోత్సవం వేడుకలు

బొబ్బిలి: జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు ఆదేశాల మేరకు బొబ్బిలి వీరమహిళలు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారితే లక్ష్యంగా క్రృషి చేస్తున్న బొబ్బిలి పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు మరియు 17వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి బర్లి శ్రీదేవి, విజయనగరం పార్లమెంటు తెలుగు మహిళ సెక్రటరీ మరియు 5వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి వెలగాడ హైమావతి గారు మరియు బొబ్బిలి నియోజకవర్గం తెలుగు మహిళా కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి బీసపు పార్వతి గారు మరియు జనసేన పార్టీ వీరమహిళలు రమ్య, యామిని, అలివేలు, సత్య, పద్మ మరియు తదితర వీరనారీమణులను సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.