గుంటూరు జనసేన జిల్లా కార్యాలయంలో మహిళా సమావేశం

గుంటూరు, జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ బొనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అధ్యక్షతన మహిళా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు వైయస్సార్ పార్టీ నాయకులు ప్రతిసారి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు మరియు వ్యక్తిగత జీవితంపై వారికి 3 పెళ్ళిళ్ళు అని రాజకీయాలకు సంబంధం లేని మహిళలను అవమాన పరిచే విధంగా మాట్లాడటాన్ని వ్యతిరేకిస్తూ వాటిపై పార్టీ తరుపున భవిష్యత్ కార్యాచరణ చేసేవిధంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.