జనసేన-టీడీపీ పార్టీలకు మద్దతు కోరిన రామదాసు చౌదరి

మదనపల్లి, ఆంధ్రరాష్ట్రంలో ప్రజా సేవా విలువలు, ప్రజా స్వామ్యాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖూనీ చేసి ఎక్కడ కూడా వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్రం లేకుండా ప్రభుత్వం నడుస్తోందని, రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో జనసేన-టీడీపీ పార్టీలకు మద్దతు ఇవ్వమని మిత్రులు, ఉద్యమం సహచరులు, సమాజం పట్ల అంకితభావం ఉన్న పీటీఏమ్ శివ ప్రసాద్, బాస్ అధినేతని వ్యక్తిగతంగా కలసి మాకు రాబోయే ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇవ్వమని కొరడానికి జనసేన నాయకులు, కార్యకర్తలు కలిసి ఆయన కార్యాలయంకి రావడం, కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వారు కూడా వీసీకే పార్టీ బాస్ పార్టీలతో కలిసి పయనిస్తున్నారు కాబట్టి వారు కూడా పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకొంటామని చెప్పడం సంతోషమని అన్నారు. మదనపల్లి, తంబళ్ళపల్లి, పీలేరు, పుంగనూరు ప్రజల ఆత్మభిమానాన్ని ఇప్పుడున్న ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కలసి అన్ని అర్హతలు ఉన్న మదనపల్లిని జిల్లాగా చేయకుండా ద్రోహం చేస్తే జనసేన బాస్ అన్ని పార్టీలు కలసి పోరాటం చేయండి జరిగింది. ఈ సంధర్భంగా జనసేన-టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాగానే పవన్ కళ్యాణ్ , చంద్రబాబుతో మాట్లాడి మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తాం అని అన్నారు. పిటియం శివప్రసాద్ మాట్లాడుతూ మా పార్టీ ఇండియా కూటమిలో ఉంది కాబట్టి పార్టీ పెద్దల సూచనల మేరకు పార్టీ కార్యవర్గ సభ్యులతో మాట్లాడి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని చెప్తాం అని అన్నారు. వ్యక్తి గతంగా రామదాస్ ఉద్యమాల్లో చాలా చురుగ్గా పాల్గొనడం, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోగల వ్యక్తి కాబట్టి ఆయన రాజకీయంగా ఎంతో ఎత్తుకి ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, రూరల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర, రాజారెడ్డి, పట్టణ సెక్రటరీ నాగవేణి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆది నారాయణ, లవన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి నవాజ్, పట్టణ సెక్రటరీ జనార్దన్, సెక్రటరీ అర్జున, చంద్ర, నరేష్, దినకర్, సత్య తదితరులు పాల్గొన్నారు.