జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయండి యు.పి.రాజు

రాజాం మండలం దోసరి గ్రామ జనసేన నాయకులు కరణము జయకృష్ణ, కత్తిరి సింహాచలం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ నాయకులు యు.పి.రాజు పాల్గొని మాట్లాడుతూ… పంట నష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ తన సొంత కష్టార్జితంతో ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 3000 మంది కౌలు రైతులకు 30 కోట్లు సహాయం ప్రకటించి వారికి అండగా నిలిచారు అని ఏ పదవి లేకుండానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అని ఒక అవకాశం ఇస్తే ఇంకెన్నో మంచి పనులు చేస్తారని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనులు పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో ప్రజలకు చేరువయ్యేలా ప్రతి జనసైనికుడు బాధ్యత తీసుకోని పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ అభ్యర్థి సైడాల జగదీశ్వరరావు, ఎంపీటీసీ అభ్యర్థి సామంతుల రమేష్, రెడ్డి బాలకృష్ణ, దుర్గారావు ఈశ్వర్ మరియు ఆ గ్రామ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.