కార్మికుల సమస్యకు పరిష్కారం చూపాలి: జనసేన

కార్మికుల సమస్యకు పరిష్కారం చూపాలి: మున్సిపల్ కార్మికులకు జనసేన పార్టీ మద్దతు

మదనపల్లె: మున్సిపల్ కార్మికుల‌ సమస్యలు పరిష్కరించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి శాశ్వత పరిష్కారం చూపించాలని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ కోరారు. ‌శుక్రవారం మదనపల్లె మున్సిపల్ కార్యాలయం ఎదుట 5 వ రోజు కొనసాగుతున్న మునిసిపల్ కార్మికుల సమ్మకు జనసేన పార్టీ మద్దతు ప్రకటించి‌ నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జంగాల శివరామ్ రాయల్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో పనిచేసే కార్మికుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ కార్మికుల సమస్యల పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని, ఒకవైపు చర్చలకు పిలుస్తూ సమస్యలు మాత్రం పరిష్కరించలేక పోతున్నారని విమర్శించారు. కార్మికులకు గతంలో ఇచ్చిన హెల్త్ అల్లవెన్స్ ఆరువేల రూపాయలు జనవరి నుంచి పూర్తిగా నిలిపి వేయడం జరిగిందని, అదేవిధంగా పదకొండవ కొత్త పిఆర్సీ ప్రకారం కార్మికులకు 6000 జీతం పెంచవలసి ఉంటే మూడు వేల రూపాయలు పెంచి మూడు వేల రూపాయల కోత విధించడం జరిగిందన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇంతవరకు కార్మికులను పెర్మినేంట్ చేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింప చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మున్సిపల్ ‌కార్మకులు పాల్గొన్నారు. ‌