మాదాసు ప్రకాష్ బాబు కుటుంబానికి యడ్లపల్లి రామ్ సుధీర్ పరామర్శ

•పార్టీ తరఫున రూ. 10 వేల ఆర్ధిక సాయం
•ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రకాష్ బాబు

పెడన నియోజకవర్గం, గూడూరు మండలం, కంకటావ గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త మాదాసు ప్రకాష్ బాబు ఈ నెల 14వ తేదీన శారదాయపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ప్రకాష్ బాబు కాలు, చెయ్యి, తలకు బలమైన గాయాలు కావడంతో పిన్నమనేని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. స్థానిక జనసేన శ్రేణుల ద్వారా విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ బుధవారం ప్రకాష్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జనసేన పార్టీ తరఫున తనవంతుగా రూ. 10 వేల ఆర్ధిక సాయం అందచేశారు. ఎలాంటి అవసరం ఉన్నా జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, జనసైనికులు కోలపల్లి శ్రీకాంత్, అంకాలు, సింగంశెట్టి అనిల్ కుమార్, షేక్ మున్నా, కొఠారి మల్లిబాబు, యదంరెడ్డి అంజిబాబు, గడ్డిగోపుల నాగ, బాకీ నాని, పవన్ తదితరులు పాల్గొన్నారు.