రాష్ట్రాన్ని ఆటవిక ఆంద్రప్రదేశ్ గా మార్చిన వైసీపీ నేతలు

  • జనసేన పార్టీకి సహకరిస్తే నిలువ నీడ లేకుండా చేస్తారా?
  • రాష్ట్రం మొత్తం పులివెందుల సంస్కృతిని తీసుకువచ్చారు.
  • వైసీపీకి ఓటు వేసినందుకు గాయపడని మనసు లేదు.
  • మాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేందుకు కూడా సిగ్గుపడేలా వైసీపీ పాలన.
  • వైసీపీ దౌర్జన్యకాండకు భయపడే స్థితిలో జనసేన లేదు.
  • ప్రజలకు అండగా ఉంటాం. ఎవరూ భయపడాల్సిన పనిలేదు.
  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళహరి.

గుంటూరు, రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి చేసి ప్రజా సంక్షేమ పరిపాలన చేస్తారని ఎంతో నమ్మకంతో రాష్ట్ర చరిత్రలో నిలిచేలా వైసీపీ పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చిన ప్రజల ఆశలు అడియాశలుగానే మిగిలాయని, పరిపాలన చేతకాని స్థితిలో దౌర్జన్యాలు, బెదిరింపులు, కక్షపూరిత పాలనతో రాష్ట్రాన్ని వైసీపీ నేతలు ఆటవిక ఆంధ్రప్రదేశ్ గా మార్చారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆవేదన వ్యక్తం చేశారు. గత మార్చిలో ఇప్పటం గ్రామంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభాస్థలికి సహకరించారు అన్న ఒకే ఒక నెపంతో గ్రామస్థుల ఇళ్లను కూల్చేందుకు వైసీపీ ప్రభుత్వం పూనుకోవటంపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎప్పుడైతే ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగిందో అప్పటినుంచి ఇక్కడి రైతులపై, జనసేన పార్టీ కార్యకర్తలపై వైసీపీ నేతలు అధికారులను అడ్డం పెట్టుకొని వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ నివసించే చిన్న సన్నకారు రైతులు రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్న ఇళ్లను రోడ్డు వెడల్పు చేసే నెపంతో కూల్చివేతలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. ఇది ఎక్కడో మారుమూలన ఉండే గ్రామమని, ఇక్కడ బస్సు సౌకర్యం కూడా లేదని, కేవలం ఆటోలు మాత్రమే తిరుగుతూ ఉంటాయన్నారు. ఇప్పుడు ఎలాంటి అవసరం లేకపోయినా ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా కేవలం కక్షపూరిత ధోరణితో మాత్రమే ఇళ్లను ద్వంసం చేసి వైసీపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైసీపీ తప్పా మరే పార్టీ ఉండకూడదు అన్న రీతిలో పాలన సాగటం ప్రజాస్వామ్య వ్యవస్థకి మంచిది కాదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యకాండను చూసి ఇలాంటి వారికా మనం ఓటు వేసి గెలిపించింది అని బాధపడని ఆంధ్రుడు లేడన్నారు. వైసీపీ దురాగతాలు అంతమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. ప్రజలెవ్వరూ కూడా భయపడాల్సిన పనిలేదని జనసేన పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని ఆళ్ళ హరి అన్నారు.