గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ అరాచకాలు

  • జనసైనికులకు అండగా చిత్తూరు జిల్లా జనసేన

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గడప గడపకు కార్యక్రమంలో స్థానిక ప్రజలు మరియు కొందరు జనసేన పార్టీ కార్యకర్తలు సమస్యలపై ప్రశ్నించి వాటిని పరిష్కరించాలని కోరగా..
సమాధానం చెప్పకపోగా, ఎమ్మెల్యే వారిని దుర్భాషలాడి అక్రమ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేయించారు. విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ జిల్లా నాయకులను ఆదేశించగా వారి ఆదేశాల మేరకు.
జనసేన పార్టీ జిల్లా నాయకులు దేవర మనోహర్, దేవినేని యశ్వంత్, భాను ప్రసాద్, తులసి ప్రసాద్, కుమార్ మరియు రాష్ట్ర నాయకులు ఆకేపాటి సుభాషిణి పూతలపట్టు జనసైనికుల విషయంగా జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి తో మాట్లాడి వారిపై పెట్టిన అక్రమ కేసులు తొలిగించి, విడుదల చేయాలని కోరారు.

యువకుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని సమస్యని సామరస్యంగా పరిష్కరించవలసిందిగా కోరడం జరిగింది. లేని పక్షంలో, అధికార పార్టీ ప్రలోభాలకు లోబడి అక్రమ కేసులు పెడితే వాటిని ఎదుర్కోవడానికి జిల్లా పార్టీ సిద్ధంగా ఉంది అని తెలియజేయడం జరిగింది.

జనసైనికులకు అండగా చిత్తూరు జిల్లా జనసేన

అరెస్ట్ అయిన పూతలపట్టు మండల కార్యదర్శులు పురుషోత్తం, మునీంద్రా, యువరాజ్ మరియు 5 మంది జనసైనికుల వెంట చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అండగా ఉంటుందని మరియు వారి కోసం ఎంతకైనా పోరాడతామని తెలియజేయడము జరిగినది.