వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలి: వడ్రాణం హరిబాబు

గుంటూరు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు జనసేన పార్టీని ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు తమవంతు బాద్యతగా మంగళవారం విరాళాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీని ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు వివిధ దేశాల నుండి మంగళగిరికి వచ్చిన ఎన్ఆర్ఐలను యూకె ఎన్నారై జనసేన నాయకులు వడ్రాణం నాగరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి వడ్రాణం హరిబాబు మంగళవారం రాత్రి వారి ఇంటి వద్ద విందుభోజనం ఏర్పాటు చేసి వారిని దుశ్శాలువాలతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఒక సైకో దుర్మార్గుడి పాలనలో సర్వనాశనం అయిపోయింది కావున మన భావితరాల కోసం మన రాష్ట్రం పునర్ నిర్మాణం కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించటం కోసం నడుం బిగించడం చాలా సంతోషకరమైన విషయం. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్న యువత అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కలిసి మూకుమ్మడిగా ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపివేయాలని వడ్రాణం హరిబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో పలుదేశాల ఎన్నారైలు, కనిగిరి నియోజకవర్గ జనసేన-టిడిపి సంప్రదింపుల సమన్వయ బాద్యులు వరికూటి నాగరాజు, గుంటూరు నగర అద్యక్షులు నేరెళ్ళ సురేష్, పొన్నూరు నియోజకవర్గ జనసేన-టిడిపి సంప్రదింపుల సమన్వయ బాద్యులు వడ్రాణం మార్కండేయబాబు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వుప్పు వెంకటరత్తయ్య, జనసేన నాయకులు చింతా రేణుకా రాజు తదితరులు పాల్గొన్నారు.