చిరంజీవిని విమర్శించే అర్హత వైసీపీకి లేదు: మాదాసు నరసింహ

రైల్వే కోడూరు: రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల ద్వారా ప్రజలకు వినోదాన్ని అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవిని విమర్శించే అర్హత వైసీపీ నాయకులకు లేదని చిరంజీవి యువత ఉమ్మడి కడప జిల్లా ఉపాధ్యక్షుడు మాదాసు నరసింహ పేర్కొన్నారు. రాష్ట్రంలో సమస్యలు వదిలేసి సినిమా హీరోలపై రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు విమర్శలు చేయటం సరికాదన్నారు. మెగాస్టార్ చిరంజీవి వాస్తవాలు మాట్లాడితే వైసీపీ నేతలకు కంటగింపుగా ఉందని విమర్శించారు. కరోనా సమయంలో ప్రభుత్వం చేయలేని పనిని మెగాస్టార్ చిరంజీవి చేసి చూపించారని అన్నారు. ఆక్సిజన్ బ్యాంకును ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టిన ప్రాణదాత చిరంజీవి అని గుర్తు చేశారు. చిరంజీవిపై మాట్లాడే అర్హత ఈ వైసీపీ మంత్రులకు ఉందా? అని మాదాసు నరసింహ ప్రశ్నించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే వైసిపి నాయకులు ప్రజా ఆగ్రహానికి మరియు చిరంజీవి అభిమానుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.