పాపిశెట్టిపాలెం గ్రామ సమస్యలను పరిష్కరించండి: జనసేన డిమాండ్

పాపిశెట్టిపాలెం రైతుల దగ్గర వసూలు చేసిన డబ్బులకు లెక్కలు చెప్పండి

సత్తెనపల్లి నియోజకవర్గం: అంబటి రాంబాబు గారూ.. రైతులే చందాలేసుకుని ఆయకట్టు పనులు చేసుకుంటుంటే.. ఇరిగిగేషన్ మంత్రిగా ఉత్సవ విగ్రహం లాగా మీరెందుకున్నట్లు? అని జనసేన పార్టీ తరఫున తరఫున ప్రశ్నించారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లడుతూ.. సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు మండలం, కుంకలగుంట గ్రామ పంచాయితీ శివారు గ్రామమైన పాపిశెట్టిపాలెంలో ఒక్కొక్క ఎకరానికి 3000 చొప్పున వసూలు చేసి ఇరిగేషన్ పనులు చేయిస్తున్న ఇరిగేషన్ మంత్రి అంబటి గారూ! మీకు సిగ్గుగా లేదా? ప్రజల దగ్గర, రైతుల దగ్గర అన్ని రకాల పన్నులు వసూలు చేస్తూ మరలా ప్రభుత్వం విధిగా చేయవలసిన నీటిపారుదల పనులను వారినే చేసుకోమనే మీరు మంత్రిగా ఎందుకు? రాజీనామా చెయ్యండి. లేదా ప్రజల దగ్గర వసూలు చేయడం మానుకోండి. బ్రో సినిమా లెఖ్ఖలు తర్వాత చెబ్దురుగానీ ముందు పాపిశెట్టిపాలెం గ్రామ రైతుల దగ్గర వసూలు చేసిన డబ్బులకు లెక్కలు చెప్పండి. భోగి పండుగ రోజు సుగాలీ సోదరీమణులతో ఆనంద తాండవం చేసిన మీరు పాపిశెట్టిపాలెంలో ఉన్న సుగాలీ సోదరులతో చెయ్యండి. సంక్షేమ పధకాల పేరుతో పప్పూబెల్లాలు పంచడానికి ఉన్న డబ్బులు రైతుల కోసం పనులు చేయడానికి లేవా? అభివృధ్ధిని అటకెక్కించిన మీరు అధికారంలో ఉండడానికి ఒక్క క్షణం కూడా అర్హత లేదు. తక్షణమే పాపిశెట్టిపాలెం గ్రామ సమస్యలను పరిష్కరించవలసిందిగా జనసేనపార్టీ తరఫున డిమాండ్ చేసారు.