వైసిపి అసమర్ధ, నీచ, లుచ్చా ప్రభుత్వం – రెడ్డి అప్పలనాయుడు ఆరోపణ

ఏలూరు: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసమర్ధ, నీచమైన పరిపాలన కొనసాగిస్తుందని, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల జనసేన పార్టీ అధికార ప్రతినిధి అప్పలనాయుడు ఆరోపించారు.. సోమవారం ఉదయం ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లా భీమిలి లోను, నెల్లూరు జిల్లాలోను జనసేన నాయకుల పైన, కార్యకర్తల పైన జరిగిన దాడిని ఆయన ఖండించారు.. జనసేన నాయకులను కార్యకర్తలను, ఇబ్బందులు పెడుతూ దాడులకు దిగుతున్నారని, జనసేన నాయకులు, కార్యకర్తల జోలికి ఊరుకునేది లేదని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు.. 2019లో చంచల్గూడా జైలు నుంచి అప్పటి ఎన్నికల ప్రచారంలో ఇది ఢిల్లీకి ఏపీకి జరుగుతున్న పోరాటమని మాతపూర్తి ప్రచారాలు కొనసాగించి అధికారంలోకి వచ్చారని అన్నారు.. సంక్షేమ కార్యక్రమాలు పేరిట పదివేల రూపాయలు ఇచ్చి, 30 వేల రూపాయలు పన్నులు, ఫైన్లు, వేసి వెనక్కు లాక్కుంటున్నారని, సంక్షేమ పథకాలు నిజమైన పేదవారికి అందుకుండా తమ కార్యకర్తలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఇసుక, మైనింగ్, మట్టి దోపిడీ చేసి కోట్లాది రూపాయలు వైసిపి నాయకులు కొల్లగొడుతున్నారని, దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆలోచనలకు జనసేన కార్యకర్తలు, నాయకులు పనిచేస్తుంటే, జనసేన నాయకులపై అవినీతి, గూండా, హత్యా రాజకీయాలు కొనసాగిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డికి‌ త్వరలో ప్రజలు ‌బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగినంపేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో జనసేన నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, నాయకులు కృపానందం, రెడ్డి గౌరీ శంకర్, బొత్స మధు, కందుకూరి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.