రాష్ట్ర ప్రజలపై వైసిపి బాదుడే బాదుడు: బొబ్బేపల్లి సురేష్ బాబు

సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, సర్వేపల్లి జనసేన పార్టీ కార్యాలయం నందు నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపాదన కావచ్చు.. ప్రజలను కావచ్చు ఏవిధంగా దోచుకోవాలి అనే విధానంతో ప్రజలను రాబందుల్లా పీక్కుతినే ఇటువంటి పరిస్థితులను మనం కళ్లారా చూస్తున్నాము. అసలే రాష్ట్రం విడిపోయి అష్ట కష్టాలు పడుతూ ఉంటే రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయాల్సిన పాలకులు వాళ్ల సో లాభాల కోసం ఏ విధంగా దోచుకోవాలో ఆ విధంగా దోచుకున్నటువంటి పరిస్థితి ఒకవైపు.. కరోనాతో చేతిలో పని లేక వ్యాపారాలు లేక అస్తవ్యస్తంగా ప్రజలు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే మరొకవైపు ఇసుక పాలసీతో ఇసుక కొరత, అధికమైన రేట్లను పెంచడం, ప్రభుత్వ ఉద్యోగులకి సకాలంలో జీతాలు ఇవ్వకుండా.. రోడ్డు పాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా కరెంటు చార్జీలు కావచ్చు, ఏ విధంగా కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగించిన పరిస్థితులు కనిపించడం లేదు. ఇక్కడ రైతు పండించిన పంటను గిట్టుబాటు ధరకు {ప్రభుత్వం ప్రకటించిన ధరకి} కొనుగోలు చేసే పరిస్థితి లేదు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారం వచ్చాక ఇంకొక మాట చెబుతోంది. ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత వై. ఎస్. ఆర్. సి. పీ. కే దక్కుతుంది. దయచేసి ఇకనైనా కళ్ళు తెరచి ఏదైతే పెరిగిన కరెంటు బిల్లులు, బస్ చార్జీలు తగ్గించి పేదవాడికి అందుబాటులోకి తీసుకురావాలని, అదేవిధంగా గ్యాస్,పెట్రోల్, డీజిల్ నిత్యవసర సరుకులు ఇవన్నీ కూడా పేదవాడికి, సామాన్యుడికి అందుబాటులోకి తేవాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలా జరగని పక్షంలో మీకు ప్రజలే బుద్ధి చెప్తారు అని బొబ్బేపల్లి సురేష్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సందీప్, రవికుమార్, మండల ప్రధాన కార్యదర్శి శివ కుమార్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.