శంఖు స్థాపనలు జరిగి సంవత్సరం దాటినా, మౌలిక వసతులు కల్పించలేని వైసీపీ

అవనిగడ్డ: ప్రభుత్వం జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకున్న వైసీపీ నాయకులు రోడ్లు, నీరు, విద్యుత్ లాంటి కనీస మౌలిక వసతులు ఎందుకు కల్పించలేక పోతున్నారని ప్రశ్నించిన అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు కరెంటు, నీరు, రోడ్లు లేకుండా లబ్ధిదారులు గృహాలు ఎలా నిర్మించుకుంటారని నిలదీసిన జనసేన నేతలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో గృహాలు మంజూరు చేస్తూ, స్వంత పబ్లిసిటీ చేసుకుంటున్న వైసీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్కొక్క గృహానికి 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన జనసేన నాయకులు జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకోవడానికి మీకు అర్హత లేదన్న స్థానిక నేతలు. మౌలిక వసతులు కల్పించకుండా గృహాలు నిర్మించాలని లబ్దిదారుల పై అధికారులు ఒత్తిడి తీసుకొస్తే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించిన శేషుబాబు.