వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన లక్ష్యం: గాదె

గుంటూరు: జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పేర్ని నానితో మొదలెట్టి కొట్టు సత్యనారాయణ వరకు
గాదె వెంకటేశ్వరరావు వైసీపీ నాయకులని చితకొట్టుడు కొట్టారు. ఈ ముఖ్యమంత్రి ఆలోచనా విధానాన్ని రోజూ చూస్తున్నాం ఏదో ఒకచోట అలజడి సృష్టిస్తున్నరో, రాష్ట్రంలో ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, ఏ రకంగా ప్రకృతి సంపదని దోచుకుంటున్నారు చూసిన తర్వాత మా నాయకుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్రం నుంచి వైసీపీ పార్టీని పంపించకపోతే ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు ఉండదని ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకుండా చేశారని, కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. వాడెవడో పేర్ని నాని అంట వాడికి ఏం సంబంధం అసలు కులాలు గురించి ఎందుకురా నీకు నువ్వు ఎప్పుడైనా నీ చరిత్రలో నీ కులం కోసం పాటుపడ్డావా ఈ వైసీపీ నాయకులు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిడితే హీరోలు అయిపోతాము అనే ఆలోచనలో ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రజల కోసం పని చేద్దాం అని ఆలోచన లేదు అని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జై లో కలిసిన తర్వాత వైసిపి ప్రభుత్వం నాయకులు పిచ్చి పట్టినట్లు అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు. మేము ఎక్కడ మీటింగ్స్ ఏర్పాటుచేసిన జనవాణి కార్యక్రమం నిర్వహించిన ప్రజలు ఒకటే మాట చెబుతున్నారు వైసీపీ ప్రభుత్వానికి బై బై చెప్పండి, వైసీపీ ప్రభుత్వాన్ని వెంటనే దించేయాలి అని ముక్తకంఠంతో చెబుతున్నారు ప్రజలు. గడపగడప కార్యక్రమం వైసిపి ప్రభుత్వం చేస్తున్నారు కదా ప్రజలు దగ్గరకు వెళ్లి క్షమాపణలు కోరుకోండి లేదంటే ప్రజలే మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణిస్తాము అని ప్రకటించిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగువాడు అనే ప్రతి ఒక్కరు హర్షం తెలియజేశారు.. వైసిపి ప్రభుత్వం మండలాలలో కానీ గ్రామాలలో కానీ ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా చాలా సంతోషిస్తున్నారు ఎందుకంటే ఈ వాలంటరీలుకి ఉన్న విలువ కూడా వారికి లేదని భావిస్తున్నారు అలాగే వాలంటరీలు ప్రతి ఒక్కరు వారు చేసే పనికి తగ్గ జీతాలు కూడా సరిగా లేవు అని ఈ ప్రభుత్వం పై విరక్తితో అందరూ ఉన్నారని త్వరలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని తెలిపారు.. రాష్ట్ర కార్యదర్శి నాయాబ్ కమాల్ మాట్లాడుతూ.. ఈ ఆంధ్రప్రదేశ్ ఎంత దౌర్భాగ్యం చేసుకుందో అర్థమవుతుంది ఒక మాజీ ముఖ్యమంత్రిని అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్ పంపిస్తే ఈ వైసీపీ ప్రభుత్వ మంత్రులు నాయకులు బాంబులు కాల్చుతూ స్వీట్లు పంచుతూ చాలా సంతోషంగా ఉన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పనికిమాలిన ప్రభుత్వం నీడలో మనము బ్రతుకుతున్నాము అని అందుకని నేను ఒకటే చెబుతున్నాను రేపు వచ్చే ఎలక్షన్లో మా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే బిజెపి పార్టీతో కలిసి ప్రయాణం చేసి మేము అధికారంలోకి వస్తామని వచ్చే విధంగా మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ గట్టిగా పని చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లికా, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, శిఖా బాలు, కొర్రపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు.