యువ క్రికెటర్ షేక్ రషీద్ క్రీడా స్పూర్తి దేశానికి గర్వకారణం

*జనసేన రాష్ట్ర కార్యదర్శులు వడ్రాణం మార్కండేయ బాబు, షేక్ నాయూబ్ కమల్

గుంటూరు, అండర్-19 క్రికెట్‌ వరల్డ్ కప్ లో భారతదేశానికి వైస్ కెప్టెన్ గా ప్రాతినిధ్యం వహించి దేశానికి వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన క్రీడాకారుడు షేక్ రషీద్ తండ్రి బాలీషావలీను సన్మానించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు, రాష్ట్ర కార్యదర్శి నాయుబ్ కమల్, గుంటూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, జనసేన నాయకులు చింతా రేణుకారాజు, దళవాయి భార్గవ్ తదితరులు.
ఈ సందర్భంగా వడ్రాణం మార్కండేయ బాబు మాట్లాడుతూ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మల్లాయపాలెం కు చెందిన నిరుపేద కుటుంబం నుండి ఎటువంటి ప్రోత్సాహం లేకుండా స్వయం కృషితో ఎదిగి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన రషిద్ భారతదేశానికి గర్వకారణమని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనలమేరకు రషిద్ తల్లిదండ్రులు బాలీషావలి ని సన్మానించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.
షేక్ నాయుబ్ కమల్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే క్రీడలపై మక్కువతో అండర్-19 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో రషీద్ ఆటతీరు అద్భుతంగా ఉందని ప్రశంసించారు.
జనసేన పార్టీ ఎల్లప్పుడూ క్రీడాకారులకు అండగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో మరింతగా రాణించాలని అభిలాషించారు. ఉప్పు వెంకట రత్తయ్య మాట్లాడుతూ షేక్ రషీద్ మా ప్రత్తిపాడు నియోజకవర్గ వాస్తవ్యులు కావడం ఎంతో ఆనందంగా ఉందని, రాబోయే రోజుల్లో దేశ క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించే స్ధాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
చింతా రేణుకారాజు మాట్లాడుతూ ఎంతోమంది యువక్రీడాకారులకు రషీద్ ఆదర్శంగా నిలిచారని, ఈ గెలుపుతో గుంటూరు జిల్లాకు గర్వకారణంగా నిలిచారని అన్నారు.