జనసేన పార్టీకి ఆకర్షితులవుతున్న యువత!

తెలంగాణ, కొల్లాపూర్: కోడేరు మండల పరిధికి సంబంధించిన మైలారం గ్రామం నుంచి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ భావజాలాలు నచ్చి భారీ సంఖ్యలో పార్టీలో చేరగా వారిని పార్టీలోకి జనసేన పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ భైరపోగు సాంబశివుడు ఆహ్వానించారు.