అంబేద్కర్ ఆశయ సాధనకు యువత పాటుపడాలి: చింతా సురేష్ బాబు

పాణ్యం, బడుగు బలహీన వర్గాల కోసం డా.బి.ఆర్.అంబేద్కర్ గారు చేసిన కృషి ఎనలేనిది. డా.బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తే దేశం సస్యశ్యామలం అవుతుంది. జనసేన పార్టీ పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ చింతా సురేష్ బాబు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా.బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రముఖ కర్నూలు పాత బస్టాండ్ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పాణ్యం నియోజకవర్గల ఇన్చార్జ్ చింతా సురేష్ బాబు అంబేద్కర్ విగ్రహానికి పూల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం చింతా సురేష్ బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. నేటి యువతరం అంబేద్కర్ సూచించిన మార్గనిర్దేశాలను అలవర్చుకోవాలని అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తే దేశం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఒక వర్గానికి డా.బి.ఆర్.అంబేద్కర్ పరిమితం కాదని ఆయన దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేసిన మహనీయుడు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి ప్రజలందరూ సమానులేనని చాటిచెప్పిన మహనీయుడు ఆయన ఆశయ సాధనకు నేటి యువత పాటుపడాలని అన్నారు. ఆయన రూపొందించిన రాజ్యాంగం వల్లే నేడు ప్రజలు దేశంలో సుఖ శాంతులు స్నేహ భావాలతో మెలుగుతున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ విభాగ రాయలసీమ కమిటీ మెంబర్ హసీనా బేగమ్, మత్స్యకార విభాగ కమిటీ కార్యదర్శి టి.రాజు, జిల్లా నాయకులు నక్కలమిట్ట శ్రీనివాస్, సుధాకర్, బజారి, షాలుబాష, మహేబూబ్ బాష, రాంబాబు, గోవింద్, గోపాల్, నాగరాజు, హుసేన్ తదితరులు పాల్గొన్నారు.