వైఎస్సార్‌ బీమా ప్రారంభించిన జగన్‌

కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు బీమా కల్పించేందుకే వైఎస్సార్‌ బీమా పథకాన్ని ప్రారంభించామని ఏపీ సీఎం జగన్‌ చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ బీమా 2021-21 కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జగన్‌ మాట్లాడారు. రూ.750కోట్లతో ఉచిత బీమా పథకాన్ని ప్రారంభించామని.. పేద కుటుంబాలపై ఎలాంటి భారం పడకుండా దీన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. బీమా చెల్లింపునకు అయ్యే పూర్తి ఖర్చును దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే బీమా పథకాన్ని నిర్వహిస్తుందని చెప్పారు.