క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యూసుఫ్‌ పఠాన్‌

టీమిండియా క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఈరోజు ఎంతో ప్రత్యేకమైందని, అలాగని ప్రపంచకప్‌, ఐపిఎల్‌ జరగట్లేదని, ఈరోజు నుండి క్రికెట్‌ ఇన్నింగ్స్‌కు ముగింపు పలుకుతున్నానని ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. అలాగే ఇప్పటి వరకూ తనకు అండగా నిలిచిన దేశానికి, కుటుంబానికి, స్నేహితులు, అభిమానులు, కోచ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాగే ప్రోత్సహించాలని కోరారు.

అనంతరం భావోద్వేగపూరితంగా వ్యాఖ్యానించారు. తొలిసారి టీమ్‌ఇండియా జట్టు జెర్సీ ధరించడం, సచిన్‌ను భుజాలపై మోయడం, 2007 టీ 20, 2011 వన్డే ప్రపంచకప్‌లు గెలవడం, ఇవన్నీ తన కెరీర్‌లో గొప్ప క్షణాలని తెలిపారు.

తన క్రికెట్‌ చరిత్రలో అంతర్జాతీయ, దేశవాళీ, ఐపిఎల్‌ ఆడానని వివరించారు. ధోనీ సారథ్యంలో టీమిండియాకు, షేన్‌వార్న్‌ కెప్టెన్సీలో ఐపిఎల్‌, జాకోబ్‌ మార్టిన్‌ నాయకత్వంలో రంజీ ట్రోఫీలో తొలిసారిగా ప్రాతినిధ్యం వహించానని అన్నారు. తనపై నమ్మకం ఉంచి అవకాశమిచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. గౌతం గంభీర్‌ నాయకత్వంలో కలకత్తా నైట్‌ రైడర్ల జట్టును రెండుసార్లు విజేతగా నిలిపినట్లు పేర్కొన్నారు.

38ఏళ్ల యూసుఫ్‌ టీమిండియా తరపున 57 వన్డేలు, 22 టీ20లు ఆడారు. 1046 పరుగులు, 46 వికెట్లు తీశారు. 2007, 2011 ప్రపంచకప్‌లు గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నారు. రాజస్తాన్‌, కలకత్తా జట్లు ఛాంపియన్‌గా నిలవడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఐపిఎల్‌ 174 మ్యాచ్‌లు ఆడిన ఆయన ఎన్నో ఇన్నింగ్స్‌లు ఆడారు. చివరి రెండు ఐపిఎల్‌ సీజన్‌ వేలాల్లోనూ ఏ జట్టూ యూసుఫ్‌ను కొనుగోలు చేయలేదు. టీమిండియా పేసర్‌ ఆర్‌. వినరుకుమార్‌ కూడా శుక్రవారమే రిటైర్మెంట్‌ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *