యువశక్తి యువత భవిష్యత్తు కోసం: ఎం హనుమాన్

విజయవాడ: శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనవరి 12వ తారీఖున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరుపతలపెట్టిన యువశక్తి బహిరంగ సభ ప్రచారంలో భాగంగా జనసేన రాష్ట్ర బీసీ నాయకుడు మరియు న్యాయవాది ఎం హనుమన్ యువశక్తి యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని వివరించారు. ఈ సందర్వ్హంగా ఆయన మాట్లాడుతూ మన యువత భవిష్యత్తు కోసం, చదువుకున్న యువతకి సరైన ఉపాధి లేకపోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు రాకపోవడంతో యువత పడే కష్టాలు కోసం ఈ యువశక్తి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువతకు చేసింది ఏమీ లేదు, కనీసం ఒక పరిశ్రమ కూడా తీసుకురాని పరిస్థితి రోజు చూస్తున్నాం, యువత ఉద్యోగాలు లేక కూలి పనులు చేసుకునే పరిస్థితి కూడా మన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది, కొంత మంది యువత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిచి పక్క రాష్ట్రాలకి ఉద్యోగం కోసం వలస వెళ్లిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో రాకూడదు అని, యువశక్తి కార్యక్రమం ద్వారా ప్రజల, ముందుకి తీసుకొచ్చిన ప్రజా వేదికే మా యొక్క జనసేన యువశక్తి కార్యక్రమం. యువత తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనే మన భారతదేశంలో.. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారి హయాంలో యువతకు సరైన అవకాశాలు లేక ఉద్యోగాలు లేక కష్టాలు పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఒక్క పరిశ్రమ కూడా రాని పరిస్థితి మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజల్ని నమ్మించి గొంతు కోసే పార్టీ అని ఇంకోసారి రుజువు చేసుకుంది, మనం రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రంలో విద్యార్థులకు, యువతీ, యువకులకు ఉపాధి కలగాలన్నా మంచి ప్రభుత్వం మనకి కావాలి. ప్రజల సమస్య కోసం పోరాడే పార్టీ జనసేన పార్టీ నేడు కౌలు రైతులకు గానీ, యువత గురించి గానీ ప్రతి సమస్యకి నేనున్నాను అని చెప్పి ముందుకు వచ్ఛే పార్టీ జనసేన పార్టీ, నేను ఉన్నాను ప్రజలకి అండగా అని చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి పార్టీకి మనం మద్దతు తెలుపుతూ 2024లో జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తానన్న హామీలను నెరవేర్చక ప్రజలను మోసం చేయడంతో వెంటనే నాకు ఉన్న బీసీ జిల్లా అధ్యక్షుడు పదవికి రాజీనామా చేసి నేను జనసేనకి రావడం జరిగింది. నేను జనసేనలోనికి రావడానికి బలమైన కారణం ఉంది. అది వైఎస్ఆర్సిపి పార్టీ ఎంతోమంది నిరుద్యోగుల్ని మోసం చేసిన పార్టీ, అలాంటి పార్టీలో నేను ఉన్నాను ఏంటి.. అలాంటి పార్టీ కోసం నేను పనిచేయడం ఏంటి అని నన్ను నేను ప్రశ్నించుకొని, నేను చాలా పేద కుటుంబం నుండి వచ్చిన యువకుడిని, నాలాగా ఏ యువకుడు మోసపోకూడదని, యువతకు నిజమైన న్యాయం చేసే పార్టీ జనసేన పార్టీ అని తెలుసుకుని, ఇంత చదువుకొని బయట 40, 50 వేలు ఉద్యోగం చేసుకోవాల్సిన యువకుడ్ని ఎందుకు రాజకీయాలకు వచ్చాను అంటే నాలాగా చదువుకున్న ఏ యువకుడు తప్పుదారి పట్టకూడదని, ఏ యువకుడు ఎలాంటి వైఎస్ఆర్సి ప్రభుత్వాన్ని నమ్ముకుని మోసపోకూడదని ఉద్దేశించి, మంచి పార్టీ ప్రజలకు న్యాయం చేసే పార్టీ జనసేన పార్టీ అని తెలుసుకొని రావడం జరిగింది. తల్లితండ్రులు అందరూ రాజకీయాలకు వద్దు నువ్వు చదువుకున్న చదువుకు ఉద్యోగం చేసుకోమని చెప్తారు, కానీ నా తల్లితండ్రులు ఏ రోజు నన్ను ఆ ప్రశ్న అడగలేదు. నేను రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయ భవిష్యత్తులో ప్రతి రాజకీయవేత్త చదువుకొన్నవాడైతే సమాజం మెరుగుపడుతుందని తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక అవకాశం ఇస్తారు అని ప్రజల ముందుకి నేను రావడం జరిగింది. ఈ రోజున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక జనసేన బీసీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. మా వృత్తి చేనేత వృత్తి అయినా, మా చాలా పేద కుటుంబం అయినా సరే మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నాకున్న కృషి, పట్టుదలతో ఉన్నత చదువు చదువుకొని, మార్షల్ట్స్ లో బ్లాక్ బెల్ట్ సంపాదించి, ఈ రోజున నా వంతు సహాయంగా ఎంతో మంది ఆడపిల్లలకు ఉచిత ఆత్మరక్షణ క్లాసుఉ నిర్వహిస్తున్నారు. నేను చాలా పేద కుటుంబంలో పుట్టాను ఇప్పటికీ నేను పేద కుటుంబంలో ఉన్నాను అయినా సరే నా వంతు సహాయంగా నా ప్రజలకి సేవ చేసుకుంటూ ఉన్నాను. అలాగే నా అన్నదమ్ముల అందరి బతుకులు మారాలి అంటే జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. పేదరికం వారికి భారం కాకూడదని భావించి జనసేన పార్టీలో నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ.. యువతీ యువకులందరూ ఉన్నత స్థాయి ఎదగాలి, ప్రతి ఒక్కరూ చదువుకొన్న చదువుకి తగిన ఉద్యోగం చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని కోరుకుంటూ, ఒక యువకుడి లాగా చదువుకున్న ఎంతో ఉన్నత చదువు చదివి 26 సంవత్సరాలు యువకుడు ఇంత చదవు చదివి, మీ ముందు రాజకీయాలకు వచ్చి, మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నానంటే ఒక్కసారి జనసేన వైపు నేను ఎంత నమ్మకం పెట్టానో మీరే ఆలోచన చేయండని హనుమన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాము గుప్తా 37 డివిజన్ అధ్యక్షులు, పండు జనసేన పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్, దుర్గారావు జనసేన నాయకులు 51 డివిజన్, నాగరాజు 48వ డివిజన్ జనసేన నాయకులు పాల్గొన్నారు.