లోపింటి కళ్యాణ్ ఆధ్వర్యంలో యువశక్తి ప్రచారం..

విజయనగరం: యువశక్తి మహాసభ జనవరి 12న ఉన్న నేపథ్యంలో విజయనగరం 27 వ డివిజన్, జొన్నగుడ్డి లో జనసేన యువ నాయకుడు, కార్పొరేట్ అభ్యర్ధి లోపింటి కళ్యాణ్ యవశక్తి కార్యక్రమంపై విస్తృత ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా
అన్ని వీదుల్లో కరపత్రాలను పంచిపెట్టి, యువశక్తి గోడపత్రికలు అంటించి ప్రచారం చేశారు. యువశక్తి సభకు యువతీ యువకులు, మెగాభిమానులు, కార్యకర్తలు, విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు ముక్కి కుమార్, పొట్నూరు ఆనంద్, గుల్లపాటి మోహన్, రెయ్యి రాజు, చందక తేజ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.