బిటివాడ గ్రామంలో యువశక్తి పోస్టర్ ప్రదర్శన

సోమవారం పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, బిటివాడ గ్రామంలో నియోజకవర్గ నాయకులు గర్భాన సత్తిబాబు ఆదేశాలు మేరకు 12 న రణస్థలంలో జరగబోయే యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యువశక్తి వాలంటరీ కమిటీ సభ్యులు సతివాడ వెంకటరమణ ఆధ్వర్యంలో పోస్టర్ ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా సతివాడ వెంకటరమణ మాట్లాడుతూ యువశక్తి కార్యక్రమం దేశంలో ఎప్పుడూ జరగని విధంగా ఒక వినూతమైనత రీతిలో నిర్వహించ బోతున్నామని, ఈ సభలో 100 మంది యువత ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సమస్యల మీద అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో వాళ్ల గొంతు వినిపించబోతున్నారని, పవన్ కళ్యాణ్ ప్రసంగంలో యువతకు దిశా నిర్దేశం చేయడం జరుగుతుందని, యువశక్తి కార్యక్రమం తర్వాత రాష్ట్రంలో అనూహ్యమైన మార్పులు చూస్తారని ఆయన అన్నారు. అలాగే యువత మార్పు కోరుకుంటున్నారని వీరఘట్టం మండల జనసేన నాయకులు సతివాడ వెంకటరమణ అన్నారు. యువశక్తి కార్యక్రమంలో అత్యధికంగా యువత పాల్గొన్న ఉన్నారని తెలియజేశారు. మరియు బిటివాడ గ్రామస్తులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రణస్థలం పర్యటన ద్వారా ఈ యువశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నామని గ్రామస్తులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.