‘యువశక్తి’ని విజయవంతం చేయాలి: పితాని బాలకృష్ణ

విజయనగరం: సుభద్రాపురం జంక్షన్‌ సమీపంలో జనవరి 12న జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యువశక్తి సభను విజయవంతం చేయాలని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం గురాన అయ్యలు ఆధ్వర్యంలో స్ధానిక గాయిత్రి డిగ్రీ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులతో సమావేశం నిర్వహించి, యువ శక్తి సభ గురించి వివరించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర యువత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వలస పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర వెనుకుబాటుతనం పోగొట్టడానికి, యువ తలో చైతన్యం తెచ్చేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ యువశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. సీఎం జగన్‌ పరిపాలనా వైఫల్యంతో యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నదని, కొందరు యువకులు గంజాయికి బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయడం లేదన్నారు. మూడు రాజధానుల పేరుతో విశాఖలోని భూములను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలను పూర్తిగా మోసంచేసిందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల సభలను అడ్డుకునేందుకే ఆంక్షలు విధిస్తూ జీఓ విడుదల చేశారని ఆయన ఆరోపించారు. యువశక్తి కార్యక్రమం అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ఫలితం ఉండదని , వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవో ఒకటిని జనసేన పార్టీ పరిగణలోకి తీసుకోవడం లేదని ఆయన తెలిపారు. మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, రోజాను చూసి మహిళా లోకం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రోజా నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పార్టీ నాయకులు గురాన అయ్యలు మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే యువశక్తి కార్యక్రమానికి యువతీ యువకులను సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని వలసలు, ఉపాధి లేమి, విద్యావకాశాలు, వ్యాపార అవకాశాలు వంటి అన్నీ అంశాలపై సమగ్రంగా యువత అభిప్రాయాలు తెలియజేసేందుకు యువశక్తి కార్యక్రమం వేదిక అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.‘మన యువత… మన భవిత’ అనేదే ప్రధాన నినాదంగా యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఆదాడ మోహన్ రావు, కాటం అశ్విని, రాజేంద్ర, త్యాడ రామకృష్ణారావు(బాలు), రవితేజ, చక్రవర్తి, వజ్రపు నవీన్ కుమార్, పవన్ కుమార్, అభిలాష్, పవన్ కుమా, వంశీ, సాయి, మణి, రవీంద్ర, ఏంటి రాజేష్, దినేష్, సాయికిరణ్, కాజా, భరత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.