18వ డివిజన్ గొల్లాయి గూడెంలో సంకల్ప యాత్ర

ఏలూరు: నవ్యాంధ్ర పునర్నిర్మాణం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు పునాది రెండూ కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి, జనసేన, బీజేపి కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి విశ్వాసం వ్యక్తం చేశారు. వివిధ కార్యక్రమాలు, సభలు, సమావేశాలతో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి.. కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతూ, ప్రజలలో చైతన్యం కల్పిస్తూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గత వైభవాన్ని తీసుకువచ్చేలా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు.. ఈ క్రమంలో ఏలూరులోని 18వ డివిజన్‌ గొల్లాయిగూడెంలో నిర్వహించిన సంకల్పయాత్రలో బడేటి చంటి ఏలూరు జనసేన ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, మాజీ ఊడ చైర్మెన్ మధ్యాహ్నపు బలరాం తో కలిసి పాల్గొన్నారు.. ఇంటింటికీ తిరిగి స్థానిక సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.. టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాల కరపత్రాలను ప్రజలకందించి, ఆయా కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.. వారికి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా సంకల్ప యాత్రలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ.. ఈరోజు 18వ డివిజన్ గొల్లయిగూడెం ప్రాంతంలో ప్రజాసంకల్పయాత్ర కి విచ్చేసినటువంటి పెద్దలు సోదరులు, జనసేన టిడిపి బిజెపి బలపరిచినటువంటి అభ్యర్థి చంటి గారికి, మాజీ ఊడ చైర్మన్ మధ్యాహ్నపు బలరాం గారికి వేదికపై ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన సోదరీ సోదరీమణులకు, మరియు బిజెపి నాయకులకు అందరికీ కూడా పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు.. మనకు ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉందని మరి ఈరోజున ఏలూరు అంతా కూడా జల్లేడు పట్టి ప్రతి గుమ్మాన్ని కూడా తిరిగి ప్రతి ఒక్క సమస్యలపై ప్రజలను చైతన్యం పరుస్తున్నారు బడేటి చంటి గారు.. ఈరోజు ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్య పరుస్తున్నామని, మరి ఈరోజున అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రం అగాధంలో ఉందని అన్నారు..రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కష్టాలు పాలు చేసే దిక్కుతోచని పరిస్థితిలో జరుగుతున్నటువంటి ప్రత్యేకమైన ఎలక్షన్ ఇవి.. ఈ ఎలక్షన్స్ లో రేపు 13వ తారీఖున జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్లో రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి అసెంబ్లీ అభ్యర్థి గా బడేటి చంటి గారిని, పార్లమెంటు అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ గారిని అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుతున్నామన్నారు. ఎందుకంటే మనం ఈ ఐదు సంవత్సరాలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులకు గురై జీవనోపాధి లేక చదువుకున్నటువంటి పిల్లలు పక్క రాష్ట్రంలో వెళ్లేటువంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఎలక్షన్ చాలా విలువైనది.. చాలా పవిత్రమైనది.. మన తలరాతను మార్చేటువంటి ఎలక్షన్ ఇది.. మే 13 వ తేదీన ఆదమరిచి వేరే వైపు చూడకుండా మీరు లోపలికి వెళ్ళగానే రెండు ఓట్లు కూడా సైకిల్ పై వేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పోరాటానికి కృషికి మనమందరం కూడా వారి అడుగులో అడిగులు వేసి ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పథంలో నడవడానికి మనందరం కూడా సహకారం అందించాల్సిందిగా తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం, బిజేపీ పార్టీల నాయకులతో పాటు జనసేన పార్టీ జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్,ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ, కార్యదర్శులు ఎట్రించి ధర్మేంద్ర, కుర్మా సరళ, 2 టౌన్ మహిళ సెక్రటరీ తుమ్మపాల ఉమా దుర్గ, మీడియా ఇంచార్జీ జనసేన రవి, నాయకులు బోండా రాము నాయుడు, రెడ్డి గౌరీ శంకర్, నూకల సాయి, మల్లపురెడ్డి సోంబాబు, కూనిశెట్టి మురళి, కోలా శివ, నిమ్మల రవి, కురెళ్ళ భాస్కర్, రావూరి దుర్గామోహన్, పవన్ 18వ డివిజన్ కు చెందిన స్థానిక నాయకులు పల్లి విజయ్, దాసరి బాబీ, భూపతి ప్రసాద్, క్రాంతి, బన్నీ, లెహర్, మహేష్, మధు, కొనికి మహేష్, జగ్గారావు తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.