నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరికలు

నర్సాపురం నియోజవర్గం: జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి నర్సాపురం నియోజవర్గంలో వైసీపీ పార్టీ నుండి భీమల శ్రీను మరియు ఆయన అనుచరులు భిమల సుజాత, భిమల శ్రీనివాస్, భిమల రామకృష్ణ, భిమల సత్యనారాయణ, భిమల వెంకటేశ్వరరావు, తాడి రమేష్, ఆరేటి వేణు, లంక శివ, ఎం.రాజు, సిహెచ్.రాజేష్, కండల సురేష్ కుమార్, పి.వాసు, మోక జ్యోతి, మోక సురేష్, మోకా విమల, శారద, విజయ, వెంకటలక్ష్మి, మౌనిక, రామలక్ష్మి దాదాపుగా 100 మంది టిడిపి, బిజెపి పార్టీలు బలపరిచిన నర్సాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన టిడిపి బిజెపి నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.