NMDCలో 224 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

హైదరాబాద్‌: కేంద్ర ఉక్కు శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నవరత్న హోదా కలిగిన ప్రభుత్వరంగ సంస్థ అయిన NMDC లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఏప్రిల్‌ 15 వరకు ఆన్‌లైన్‌ అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 224 పోస్టులను భర్తీచేస్తున్నది. ఇందులో ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌, ఇతర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా, నాన్‌ఎగ్జిక్యూటివ్‌, ఇతర పోస్టులను రాతపరీక్ష ద్వారా ఎంపికచేయనుంది.

మొత్తం పోస్టులు: 224

ఇందులో ఎగ్జిక్యూటివ్‌ పోసులు 97

సూపర్‌వైజర్‌ కమ్‌ చార్జ్‌మ్యాన్‌ 71

సీనియర్‌ టెక్నీషియన్‌ కమ్‌ ఆపరేటర్‌ 27

 టెక్నీషియన్‌ కమ్‌ ఆపరేటర్‌ 15

 అర్హతలు: ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు బీఈ, బీటెక్‌లో ఏదో ఒకటి చేసి ఉండాలి. సూపర్‌వైజర్‌ పోస్టులకు ఇంజినీరింగ్‌లో డిప్లొమా, సీనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ చేసి ఉండాలి. అదేవిధంగా సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.

ఎంపిక ప్రక్రియ: ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌ పోస్టులకు.. ఇంటర్వ్యూ ద్వారా, మిగిలిన పోస్టులకు రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. దరఖాస్తు చేసేటప్పుడు ఏ ప్రాంతంలో ఇంటర్వ్యూ లేదా రాతపరీక్షకు హాజరవుతామనే విషయాన్ని స్పష్టం చేయాల్సి ఉంటుంది.

అప్లికేషన్లకు చివరితేదీ: ఏప్రిల్‌ 15

వెబ్‌సైట్‌: www.nmdc.co.in