ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 24వ రోజు

ఏలూరు నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 24వ రోజు రెడ్డి అప్పలనాయుడు పాద యాత్ర స్థానిక 7వ డివిజన్ లో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కార్పొరేటర్లుగా గెలిచి సంవత్సర కాలం పూర్తైంది, సంబరాలు జరుపుకున్నారు. ఈ సంవత్సర కాలంలో మీరు సాధించిన అభివృద్ధి ఏంటి ? అని ప్రశ్నించారు. వైసీపీ పార్టీ వచ్చిన తరువాత ఏలూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థలను పూర్తీగా నిర్వీర్యం చేసింది. స్థానికంగా ఉండే నాయకులను డమ్మీలుగా చేసి వారికి ఏవిధమైన నిధులు ఇవ్వకుండా వారిని ఉత్సవ విగ్రహాలలాగా ఈరోజు కార్పోరేటర్లందరిని చులకన చేయడం జరుగుతుంది. సంవత్సర కాలం పూర్తి చేసుకున్న కార్పోరేటర్లు స్థానిక సంస్థలో ఉండే హక్కులను పర్యవేక్షించాల్సిన బాధ్యత మీపైన ఉంది. ఒకొక్క కార్పోరేటర్లను ఎంతో విశ్వాసంతో నమ్మి మిమ్మల్ని ఎంచుకున్నారు. తమ తమ డివిజన్లలోని సమస్యలు పరిష్కరిస్తారని ఆ డివిజన్ కీ రావాల్సిన నిధులు రాబడతారని ప్రజల మనోభావాలను కాపాడతారని మిమ్మల్ని ఎన్నుకున్నారు, కానీ ఈరోజు మీరు మీ హక్కులను పర్యవేక్షించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. చైతన్యం ప్రదర్శించలేకపోతున్నారు. మీ బాధ్యతలు నిర్వహించే ఎటువంటి పనులు చేయడం లేదు. కేవలం ఎమ్మెల్యే చేతికింద, మేయర్ చేతికింద బానిసలుగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా నష్టం. సంవత్సరం పూర్తి అయిందన్న భావనలో మాత్రం మీరు ఉన్నారు కానీ ఈ సంవత్సర కాలంలో మీరేం చేయగలిగారు. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మీరేం చేశారు? అనే ఆలోచన ప్రతి ఒక్క కార్పోరేటర్ లోను రావాలి. ఒకే ఒక్క కార్పోరేటర్ (పప్పు ఉమామహేశ్వరరావు) ఒక్కరే ఈరోజున అవినీతి జరుగుతోందని సిఎంకి లేఖ రాశారు.. అలాగే అనేక శాఖలకు ఆ లేఖను పంపారు.. అయినప్పటికీ కూడా మిగతా కార్పోరేటర్లు కూడా మీ మీ డివిజన్ కి ఎంత ఆదాయం వస్తుంది? ఎంత ఖర్చు పెడుతున్నారు? రోడ్లకు ఏమిస్తున్నారు? జీతాలకు ఏమిస్తున్నారు? పన్నుల రూపంలో ఎంత వస్తుంది? అనేది చూసుకోవాల్సిన బాధ్యత మీపైన ఉంది. కేంద్ర ప్రభుత్వం నుండి మీకు నిధులు రావాల్సిన పని లేదు. అధిక మొత్తంలో కోట్లాది రూపాయల పన్నులు కార్పోరేషన్ పరిధిలో ఉన్నాయి. ఆ డబ్బును ఏవిధంగా ఖర్చు పెట్టాలి. ప్రధానంగా ప్రతి ఒక్క కార్పోరేషన్ ఆవైపుగా ఆలోచన చేసి ఈ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చేయడానికి చైతన్యం ప్రదర్శించాలి. చాలా చోట్ల కార్పోరేటర్లు బలహీన వర్గాలపై ఒత్తిడులు చేస్తున్నారు. ఎవరు ఏ పార్టీలో తిరుగుతున్నారో ఆ పార్టీ లో తిరిగే కార్యకర్తలపై ఒత్తిడి చేద్దామా వాళ్ళకు రావాల్సిన రాయితీలు తీసేద్దామా ఇలాంటి ఆలోచనలు మానుకోండి. ప్రజలు మీకిచ్చిన అధికారాన్ని ప్రజలకు వినియోగించే విధంగా చైతన్యం పెంచి స్థానిక సంస్థల యొక్క గౌరవాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేయండి. రాబోయే 4 సంవత్సరంలో మీ పరిపాలన కొనసాగించే దిశగా మీ మార్కును కార్పోరేటర్ డివిజన్ స్థాయిలో పార్టీలకు అతీతంగా మీరు పనిచేయాలని సూచనలు ఇస్తున్నాను. దీన్ని పెంపొందించుకోని పక్షంలో ప్రజల మధ్య డమ్మీలుగా ఉంటారు, మీకు ఏ మాత్రం గుర్తింపు ఉండదు. ఇప్పటికే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ చాలా దీనస్థితిలో ఉంది, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, మంచినీటి సదుపాయం లేదు, చెత్త ఎత్తించే కార్పోరేటర్లు లేరు, ఇక్కడి నుండి అయినా ఏలూరులోని హేలాపురిలో మీ గౌరవాన్ని పెంపొందించుకోవాలని కార్పోరేటర్లు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, అది కాని పక్షంలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఉంటుందని హెచ్చరిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధానకార్యదర్శి సరిది రాజేష్, ఫాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, ఉపాధ్యక్షులు బొత్స మధు, అల్లు సాయి చరణ్, సోషల్ సర్వీస్ మురళి, కందుకూరి ఈశ్వరరావు, నిమ్మల శ్రీను, కురెళ్ల భాస్కర్, బుద్ద నాగేశ్వరరావు, బొద్దాపు గోవిందు, ధర్మేంద్ర, వీర మహిళలు సుజాత ఉమదుర్గ, రాము, స్థానిక నాయకులు అప్పారావు, వీరబాబు, ఉమా, లక్ష్మణరావు, అనిల్, పోశయ్య, సింహాచలం, సత్తిబాబు, మల్లిబాబు పాల్గొన్నారు.