AP IMSD: ఏపీలోని ప్రభుత్వ రంగ సంస్థలో 101 జాబ్స్‌.. రాత పరీక్ష లేదు

విజయవాడలోని ఇన్సూరెన్స్‌‌ మెడికల్‌ సర్వీసెస్‌ డిపార్టుమెంట్‌ (IMSD) ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన 101 మెడికల్‌ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన నాలుగు జోన్లవారీ పోస్టులు ప్రకటించారు. అర్హత, ఆసక్తి ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://labour.ap.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 101

స్టాఫ్‌ నర్సులు- 92

ల్యాబ్‌ టెక్నీషియన్‌- 7

ఈసీజీ టెక్నీషియన్‌- 2

ముఖ్య సమాచారం:

ఎంపిక: అకడమిక్‌ ప్రతిభ, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. అకడమిక్‌ ప్రతిభకు 75 శాతం, అనుభవానికి 15 శాతం వెయిటేజీ ఇస్తూ ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఈఎస్‌ఐ సంస్థల్లో రెండేళ్ల అనుభవం ఉన్నవారిని నేరుగా నియమిస్తారు.

అర్హత: నర్సులకు ఇంటర్‌తోపాటు డిప్లొమా (జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌ వైఫరీ)ఉత్తీర్ణులై ఉండాలి. బీఎస్సీ (నర్సింగ్‌) అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైవ్స్‌ కౌన్సిల్‌ గుర్తింపు తప్పనిసరి. కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరం. ల్యాబ్‌ టెక్నీషియన్లకు ఇంటర్‌ తరవాత ఎల్‌టీ కోర్సు పూర్తిచేసి ఉండాలి.

డిప్లొమా/ బీఎస్సీ (ఎంఎల్‌టీ) చేసినవారు, పీజీ డిప్లొమా (క్లినికల్‌ బయో కెమిస్ట్రీ) ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసీజీ టెక్నీషియన్‌కు ఇంటర్‌ పాసైతే చాలు. ఈసీజీ ప్రక్రియలో కనీసం ఆర్నెల్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు ఏప్రిల్‌ 1 నాటికి 42 ఏళ్లు మించకూడదు. రిజర్వుడు వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

వేతనం: ల్యాబ్‌ టెక్నీషియన్లు, నర్సులకు రూ.17,500; ఈసీజీ టెక్నీషియన్లకు రూ.12,000 ఉంటుంది.

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొన్న దరఖాస్తు ఫారాన్ని నింపి నిర్దేశిత ధృవపత్రాలు జతచేసి కింది చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు ఫీజు: రూ.300 (దివ్యాంగులు, మాజీ సైనికులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100)

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 31, 2021

చిరునామా: ద డైరెక్టర్‌, ఇన్‌స్యూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌, కేశినేని వెంకయ్య నగర్‌, న్యూ ఆటోనగర్‌ రోడ్‌, ఎనికెపాడు, విజయవాడ – 521108.

వెబ్‌సైట్‌: https://labour.ap.gov.in/