కోవాగ్జిన్‌ టీకా తీసుకున్న హర్యానా మంత్రి అనిల్ విజ్‌

హర్యానాలో ప్రారంభమైన భారత్‌ బయోటెక్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ‘కొవాగ్జిన్‌’ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ ‘తొలి వలంటీర్‌’గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ట్రయల్స్‌ లో భాగంగా అనిల్ విజ్‌.. కోవాగ్జిన్‌ టీకా ట్రయల్ డోసు తీసుకున్నారు. అంబాలాలోని ఓ హాస్పిటల్‌లో ఆయన ఇవాళ కోవిడ్ టీకాను వేయించుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్‌ టీకాను రూపొందిస్తున్నది. అయితే ఇవాళ కోవాగ్జిన్‌ మూడవ దశ ట్రయల్స్ దేశంలో ప్రారంభం అయ్యాయి.