పరేశ్ రావల్‌కు అరుదైన గౌరవం

తెలుగు, తమిళం, హిందీతోపాటు పలు భాషల్లో తన నటనతో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్‌కు అరుదైన గౌరవం లభించింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నటుడు పరేశ్ రావల్‌ను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఛైర్మన్ (ఎన్ఎస్ డీ) గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ఎన్ఎస్ డీ ఛైర్మన్ గా నియమితులైన ప్రసిద్ద భారతీయ నటుడు, నేషనల్ అవార్డు విన్నర్ పరేశ్ రావల్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఉన్నత స్థాయికి వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది.