సూళ్లూరుపేటలో జనసేన-టీడీపిల ఆత్మీయ సమావేశం

సూళ్లూరుపేట నియోజకవర్గం: జనసేన-టీడీపి పార్టీల ఆత్మీయ సమావేశం బుధవారం సూళ్లూరుపేట టౌన్ లో నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసారు. అదేవిదంగా టీడీపీ ముఖ్యనాయకులు, అన్ని మండలాల నాయకులు హాజరుకావడం జరిగింది. 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం స్థాపించే విధంగా మరియు సూళ్లూరుపేట నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునేలా ఇరు పార్టీలు కలిసి పని చేయాలనీ ఈ సమావేశంలో తీర్మానించుకోవడం జరిగింది. ఈ నెల 17వ తేదీ నుండి ఉమ్మడి మేనిఫెస్టో తో గడప గడప కార్యక్రమం నిర్వహించాలని ఇరు పార్టీల సెంట్రల్ ఆఫీస్ నుండి ఆదేశాలు అందాయి, కావున ప్రతి ఒకరు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలనీ నిర్ణయించడం జరిగింది. వైసీపీ ఓటమి భయంతో దొంగ వోట్లని అధికమొత్తం ఓటర్ జాబితాలో చేరుస్తోందని కావున ఓటర్ లిస్ట్ లోని అవకతవకలు గుర్తించి దొంగ ఓట్లను తొలగించేలా చెర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నతి పత్రాలు ఇవ్వాలని, స్థానిక ఎమ్మెల్యే అవినీతి గురించి చార్జిషీట్ తయారు చేసి మీడియా ముందు పెట్టాలని తీర్మానించడం జరిగింది. తేదీల్లో రోడ్ ల దుస్థితిపై డిజిటల్ మీడియా కాంపెయిన్ నిర్వహించి ఉమ్మడి పోరాటం చేయాలని ఇరు పార్టీల అధ్యక్షుల ఆదేశాల మేరకు నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.