లైఫ్ మూవీ నుంచి మరో పోస్టర్ విడుదల

*లైఫ్ సినిమా పోస్టర్ కిరోసిన్ హీరోయిన్ మరియు యూ ట్యూబ్ ఫ్రాంక్ స్టార్స్ తో విడుదల

ఇటీవల వైజాగ్ లో రోమ్ ప్రొడక్షన్స్ మరియు రోమ్ పిక్చర్స్ సమర్పణలో కొట్టె మల్లికార్జున్(అర్జున్) హీరో గా, మేఘ హీరోయిన్ గా, నిర్మాతలు రాజు గోపాల్ పొడాల, సుజాత మరియు కళ్ళ అర్జున్ దర్శకత్వంలో మరియు అనిల్, ఆమని, ఎంపీరెడ్డి, జగదీష్ నటులతో కూడిన లైఫ్ ఫిల్మ్ షూటింగ్ పూర్తి అయి విడుదలకు సిద్ధంగా ఉంది. లైఫ్ ఫిల్మ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. ఇటీవల విడుదల అయిన కిరోసిన్ సినిమా హీరోయిన్ ప్రీతి మరియు యూ ట్యూబ్ ఫ్రాంక్ స్టార్స్ వెంకట్ పల్లి, తేజ, ఇతర నటీనటులతో లైఫ్ మూవీ పోస్టర్ హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ థియోటర్ ప్రాంగణంలో అట్టహాసంగా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా హీరో కొట్టె మల్లికార్జున్ అర్జున్ మాట్లాడుతూ.. అన్ని రకాల ఎలివేషన్స్ తో.. సరికొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన కేజిఫ్ మూవీలో ఏ విధంగా అయితే విజువల్స్ మేకింగ్.. కెమెరా పనితనం ఉందో ఆ విధంగా మా లైఫ్ మూవీలో మేకింగ్ విజువల్స్ కూడా అంతే అధ్బుతం గా ఉంటాయి. మూవీ కు సంబంధించి రెండు పోస్టర్స్ విడుదల చేశాం. మొదటి పోస్టర్ బిజెపి పార్టీ పెద్దలు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా, రెండవ పోస్టర్ హీరోయిన్ ప్రీతి, యూ ట్యూబ్ ఫ్రాంక్ స్టార్స్ వెంకట్, తేజతో విడుదల చేయడం చాలా సంతోషంగా అనిపించింది. త్వరలోనే మూవీ విడుదల వివరాలు మీడియాకు, ప్రేక్షకులకు తెలియచేస్తాము అని పేర్కొన్నారు. ఈ చిత్రంను ప్రేక్షకులు ఆదరించి మా లాంటి యువ హీరోలను, నటీనటులను ప్రోత్సహించాలని హీరో కొట్టె మల్లికార్జున్ విజ్ఞప్తి చేశారు.