ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ – జనసేన విజయ యాత్ర 40వ రోజు

  • 40వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం

శ్రీకాళహస్తి నియోజకవర్గం: ఏర్పేడు మండలం, చింతల పాలెం పంచాయతీలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా. గ్రామస్థులు వినుత కోటకి బాణసంచా, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. పంచాయతీలో ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది.* రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది.
గ్రామంలో త్రాగు నీరు సమస్య, స్ట్రీట్ లైట్లు లేవు, విద్యుత్ లైన్లు ఇళ్ళ పై ఇబ్బందికరంగా ఉన్నాయ్, డ్రైనేజ్ కాలువలు లేవు, లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు ప్రజలు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని వినుత ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, నాయకులు వెంకటరమణ యాదవ్, జనార్ధన్, గురు ప్రసాద్, పేట చంద్ర శేఖర్, కావలి శివకుమార్, దండి రాఘవయ్య, పట్టణ అధ్యక్షుడు తోట గణేష్, రవి కుమార్ రెడ్డి, జ్యోతి రామ్, పేట చిరంజీవి, శారద, లక్ష్మి, కవిత, హేమంత్ గౌడ్, చిన్న మునయ్య, రాజేష్, సురేష్, ఉదయ్, జనసైనికులు దినేష్, బన్నీ, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.