బాబ్రీ మసీద్ తుది తీర్పు

దాదాపుగా మూడు దశాబ్దాల నుంచి కోర్టులో వాయిదా పడుతూ వస్తున్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. మసీదు కూల్చివేత పథకం ప్రకారం జరగలేదని.. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారంతా నిర్దోషులే అంటూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. సీబీఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ 2000 పేజీలు ఉన్న తీర్పు కాపీనీ చదివి తీర్పు వెలువరిచారు. సీబీఐ సమర్పించిన చాలా ఆధారాలు పరిశీలించి.. వాటి మూలంగా నిందితులను దోషులగా తేల్చలేమని కోర్టు చెప్పింది. నిందితులకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు లేవని చారిత్రాత్మక తీర్పును వెలువరించారు జడ్జి సురేంద్ర యాదవ్. అయితే జడ్జి సుకేంద్ర యాదవ్ ఈ బాబ్రీ మసీదు కేసులో తీర్పును వెలువరించిన అనంతరం రిటైర్ అయ్యారు.

న్యాయమూర్తి సుకేంద్ర యాదవ్ గత ఏడాది రిటైర్ కావలసి ఉంది. కానీ బాబ్రీ మసీదు కేసు లో పూర్తి న్యాయపరమైన తీర్పును వెలువరించేందుకు… సుప్రీంకోర్టు సురేంద్ర యాదవ్ పదవీ కాలాన్ని ఒక ఏడాది పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ఆయన పదవి కాలం నేటితో ముగియనుంది. ఇక ఈరోజు బాబ్రీ మసీదు కేసులో తీర్పు ఇచ్చి చివరికి… న్యాయమూర్తి సుకేంద్ర యాదవ్ కూడా రిటైర్ అయ్యారు.

ఈ కేసులలో మొత్తం 48 మంది మీద అభియోగాలు నమోదుకాగా.. ఇందులో 16 మంది మరణించారు. మిగతా 32 మంది సెప్టెంబర్ 30న కోర్టు ఎదుట హాజరుకావాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇందులో కేంద్రమాజీ మంత్రి ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ కరోనా సోకడంతో హాజరుకాలేక పోయారు. వయోబారం కారణంతో మురళీ మనోహర్ జోషి, ఎల్ కే అద్వాణీలు హాజరు కాలేదు. 26 మంది కోర్టు ముందుకు హాజరైయ్యారు.