హత్రాస్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి: మోడీ

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఫోన్ చేసి హత్రాస్ ఘటనకు గురించి తనతో ప్రధాని మోడీ మాట్లాడారని సీఎం యోగి ఆదిత్య నాథ్ ట్వీట్ చేశారు. నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారని పేర్కొన్నారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నామని యోగి ఆదిత్యనాథ్ వివరించారు. నిందితులను వదలబొమని.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయాన్ని యోగి తెలిపారు.

యూపీలోని హత్రాస్ లో ఓ యువతిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హింసిస్తూ, సామూహిక లైంగికదాడికి పాల్పడ్డిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె నాలుకను కోసేశారు. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మరోవైపు ఆమె శరీరంలోని పలు ఎముకలు విరిగిపోయాయి. శరీరంలోని పలు అవయవాలు పని చేయని స్థితిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలను రగిల్చింది. ఈ నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ప్రధాని మోడీ ఈ రోజు ఫోన్ చేసి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇదిలాఉంటే మరోవైపు.. అంత్యక్రియలపై దుమారం చెలరేగింది. కుటుంబసభ్యులు లేరు అని.. విరుద్దంగా నిర్వహించారని కామెంట్ చేయగా జిల్లా కలెక్టర్ కామెంట్ చేశారు. మృతురాలి అంత్యక్రియలు జరిగే సమయంలో ఆమె తండ్రి, సోదరుడు ఉన్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు.