బండ్లపాలెం జనసేన ఆత్మీయ సమావేశం

సర్వేపల్లి నియోజకవర్గం, ఆదివారం బండ్లపాలెం జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ బండ్లపాలెం జనసైనికులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి డా. బి. ఆర్.అంబేద్కర్ వంటి మహానుభావుల మార్గంలో నడిచే నాయకుడు పవన్ కళ్యాణ్ కొన్ని కుటుంబాలకే, కొన్ని కులాలకే పరిమితమైన రాజ్యాధికారాన్ని అన్ని వర్గాల వారికి అందించేందుకు ఆయన తపస్సు చేస్తున్నారు. ఎంతో విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని సమాజ సేవ కోసం పరితపిస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భూగర్భ జలాలు దోపిడీకి గురై స్థానిక వ్యవసాయానికి ఇబ్బందిగా మారింది. కాలుష్యం కోరల్లో చిక్కుకుని గాలి నీరు ఆహారం కలుషితం అయిపోయాయి. థర్మల్ ప్లాంట్ రేడియేషన్తో అల్లాడిపోతున్నాం. కృష్ణపట్నం సంస్థలలో స్థానికుల ఉద్యోగ అవకాశం కల్పించడం కరువైంది. సమస్యలపై జనసైనికులు గలమెత్తాలి. మరో సంవత్సరంలో రానున్న ఎన్నికల కోసం జనసేన పార్టీని గడపకు తీసుకెళ్లి రాష్ట్ర అభివృద్ధి సాధించగలిగే నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కరే అని తెలియపరచాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏదైనా సరే ఈసారి జనసేనకు మద్దతుగా మద్దతుగా నిలబడాలని కోరుకుంటున్నాను. వైసిపి ప్రభుత్వం ఎప్పటికి ప్రజలను దేహి అనే పరిస్థితుల్లోనే ఉంచుతుంది. ఉపాధి కల్పించడంలో కానీ కావలసిన మౌళిక వసతులు కల్పించడంలో కానీ రోడ్ల వసతులు రోడ్ల సౌకర్యం కల్పించడంలో గాని విఫలమవుతుంది. ప్రజల పడుతున్న అవస్థలు కనపడవు నిన్ననే వైసిపి నాయకురాలు మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల నిర్మాణం ఒక పెద్ద స్కాం అని వివరించారు. ఈ అవినీతి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. గత నాలుగు సంవత్సరాల నుంచి పేదవాడి ఇంటికల కలగానే మిగిలిపోయింది. ఉగాదికి ఇస్తాము, దీపావళి ఇస్తామని, ఇప్పటికీ వాటిని ఊసే లేదు. రానున్న రోజుల్లో జనసైనికులందరూ సమిష్టిగా నిలబడి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏదైనా కూడా వారిని గెలిపించేందుకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అకాల వర్షాలు కారణంగా కౌలు రైతులు దిగాలపడి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలోనే మొదటిసారిగా కౌలు రైతులు పడుతున్న అవస్థలను గమనించి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకి తన సొంత సంపాదన నుంచి లక్ష రూపాయలు ఇచ్చి వారికి ఆసరాగా పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. దత్తపుత్రుడు ప్యాకేజీ అనే వాళ్లకి చెప్పుతో సమాధానం చెప్పండి. మీ సమస్య ఏదైనా కూడా జిల్లా యంత్రాంగం తోడుగా ఉంటుంది.ఇప్పుడు మనకు లీగల్ సెల్ ఉంది అకారణంగా ఎవరైనా అధికార నాయకుడు ఇబ్బంది పెడితే జనసేన తరఫున మేమందరం అడ్డుగా నిలబడతాం అని తెలిపారు. స్థానిక జనసేన నాయకులు అశోక్, వెంకీ అద్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జనసేన నాయకులు శ్రీపతి రాము, మండల అధ్యక్షులు మనుబోలు గణపతి తదితరులు పాల్గొన్నారు.