పాడేరు ఘాట్ రోడ్డు బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నాయకులు

పాడేరు నియోజకవర్గం: పాడేరు ఘాటీ రోడ్డు మోదపల్లి వ్యూ పాయింట్ సమీపంలో ఆదివారం జరిగిన ఆర్టీసీ బస్ ప్రమాద బాధితులను జిల్లా కేంద్రీయ ఆస్పత్రిలో మంగళవారం డా.వంపూరు గంగులయ్య జనసేన నాయకులతో కలసి పరామర్శించి, బాధితులతో మాట్లాడి తెలుసుకున్నారు. బాధితులు స్వయంగా ప్రమాదం జరగడానికి గల కారణాలు వారి మాటల్లోనే తెలుపుతూ.. రహదారికి రక్షణగొడ నిర్మాణం చేసి దశాబ్దాలు గడిచిందని, అలాగే ఆర్&బి ఇంజినీరింగ్ అధికారుల వైఫల్యం జంగిల్ క్లీయరెన్స్ వంటివి నిర్లక్ష్యం చేయడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ సందర్బంగా గంగులయ్య మాట్లాడుతూ ఇటువంటి ఘోరప్రమాదలు జరగడం గత రెండు, మూడేళ్ళ కాలంలో నుంచి ఘాటీ రోడ్డులో అధికమవుతుందని ఇప్పటికైనా రక్షణ గోడలు నాణ్యతగా నిర్మించాలని ప్రయాణికుల సురక్షితం కోసం ప్రభుత్వం వేలకోట్ల ఖర్చుపెడుతున్నదని ఇటువంటి వర్షాకాల సమయాల్లో ఎప్పటికప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేసే బాధ్యత ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్య ధోరణితో చూడటం తగదని అన్నారు. అలాగే ప్రైవేటు కంపెనీలలో చనిపోయిన వ్యక్తులకు ఇచ్చేటటువంటి పరిహారం ఎక్కువగా ఉంటుంది. కానీ గిరిజన ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనకుగాను మృతులకు, 10లక్షలు, తీవ్రబాధితులకు 5 లక్షలు, పాక్షికగాయలతో బయటపడినవాళ్ళకి లక్ష రూపాయల చొప్పున ప్రకటించారు. ఆర్టీసీ సంస్థ నుంచి పరిహారం అందడమే కాకుండా ప్రభుత్వం కూడా మనవతాదృక్పదంతో సహాయం చేయాలని ఈ సందర్బంగా జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు సక్రమంగా అందుతున్నప్పటికి బాధిత కుటుంబాలకు, బాధితులకు ప్రకటించిన ఎక్స్ గ్రెసియా విషయం లో సత్వరమే చేతల్లో చూపించే విదంగా ప్రయత్నం చేసి స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు తమ గిరిజన ఔదార్యాన్ని చాటుకోవాలి. ప్రమాదం జరగడం వెనకాల నిర్లక్ష్యం కూడా ప్రధానంగా ఉందనే వాస్తవిక కోణాన్ని కూడా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ మరియు మిగతా ప్రజాప్రతినిధులు గుర్తించే విదంగా ఆలోచన చెయ్యాలని భవిష్యత్ లో ఇటువంటి ఘోరమైన ప్రమాదాలు జరగకుండా చూసేందుకు చొరవ తీసుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా జనసేనపార్టీ నాయకులు స్వయంగా ప్రమాద బాధితులుకి పళ్ళు, బ్రెడ్స్ అందించి వారికి మనోధైర్యంతో ఉండాలని తెలిపారు. వీరమహిళలు కిటలంగి పద్మ, బొంకుల దివ్యలత, దుర్గాలత, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్, హుకుంపేట నాయకులు బలిజకోటేశ్వర్రావు, కార్యనిర్వహన అధ్యక్షులు సురేష్ పర్దాని, తాంగుల రమేష్, తల్లే త్రిమూర్తి, అరకు నాయకులు బంగారు రామదాసు తదితర జనసైనికులు పాల్గొన్నారు.