కాలుష్యం కారణంగా గోవా చేరిన కాంగ్రెస్ అధినేత్రి

ఢిల్లీలో వాయు కాలుష్యంతో గోవా చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్య చిట్కాలు పాటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకించి ఆమె వ్యాయామాలతోపాటు సైక్లింగ్‌ కూడా చేస్తున్నారు. గోవాలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌ ఆవరణలో సోనియాగాంధీ సైకిల్‌ తొక్కుతూ కనిపించారు. సైక్లింగ్‌తో పాటు జాగింగ్‌ చేశారు. కాంగ్రెస్ అధినేత్రి.. దిల్లీలో కాలుష్యం కారణంగా మరిన్ని సమస్యలు రాకుండా తాత్కాలికంగా గోవాలో ఉంటున్నారు. దీర్ఘకాలంగా ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సోనియాగాంధీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 73 సంవత్సరాలు. దిల్లీలో వాయుకాలుష్యం అధికం కావడంతో వైద్యుల సూచన మేరకు స్వస్థత కోసం ఆమె గోవాలో ఉంటున్నారు.